NTV Telugu Site icon

శ్రీలంక చేరుకున్న భారత జట్టు…

శిఖర్‌ధావన్‌ నేతృత్వంలోని 20 మంది సభ్యుల టీమ్‌ఇండియా శ్రీలంక వెళ్లారు. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో వీరంతా వెళ్లారు. వచ్చేనెల ఆ జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనున్నారు. ఈ క్రమంలో గత రెండు వారాలుగా ముంబైలోని ఓ స్టార్‌ హోటల్లో క్వారంటైన్‌లో ఉన్న వారు దానిని పూర్తిచేసుకున్నారు. కాగా, ఆటగాళ్లు విమానంలో వెళ్తున్న ఫొటోలను అలాగే అక్కడికి చేరుకున్న ఫోటోలను బీసీసీఐ పోస్ట్ చేసింది. మరోవైపు ఈ జట్టులో పలువురు సీనియర్లతో పాటు కొంతమంది తొలిసారి జట్టుకు ఎంపికైనవారు కూడా ఉన్నారు. అవకాశం వస్తే సత్తా చాటాలని చూస్తున్నారు. ముఖ్యంగా పృథ్వీషా, కుల్‌దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌, భువనేశ్వర్‌ కుమార్‌ లాంటి ఆటగాళ్లు ఇంతకుముందులా తమ స్థానాలను పదిలపర్చుకోవాలని ఆశిస్తున్నారు.