NTV Telugu Site icon

క్వారంటైన్ ముగించుకున్న టీంఇండియా…

జూన్‌ 18 న న్యూజిలాండ్‌ తో ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ లో తలపడనున్న టీంఇండియా ఇంగ్లండ్ కు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈరోజుతో అక్కడ మూడు రోజుల క్వారంటైన్ ముగియడంతో నేడు మైదానంలోకి అడుగు పెట్టి ప్రాక్టీస్ ప్రారంభించింది. టీమిండియా స్టార్‌ ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా నెట్స్‌లో బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసాడు. అయితే ఇంగ్లండ్ పర్యటనకు ముందు ముంబైలో రెండు వారాల క్వారంటైన్‌ లో భారత ఆటగాళ్లు జూన్‌ 3న ఇంగ్లండ్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఇక డబ్యూటీసీ ఫైనల్‌ అనంతరం కోహ్లీసేన అక్కడే ఉండి… ఆగస్టు​ 4 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ లో తలపడునుంది.