Site icon NTV Telugu

విండీస్‌తో సిరీస్‌కు ముందు షాక్.. టీమిండియా క్రికెటర్లకు కరోనా

వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు ముందు భారత క్రికెట్ జట్టులో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. పలువురు టీమిండియా క్రికెటర్లు కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. మొత్తం 8 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని.. బాధితుల్లో శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారని తెలుస్తోంది. క్రికెటర్లతో పాటు టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌కు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని జాతీయ మీడియా పేర్కొంది.

Read Also: ఆ ఒక్క పరుగు తీయనందుకు.. న్యూజిలాండ్ ఆటగాడికి ఐసీసీ అవార్డు

కాగా ఈనెల 6 నుంచి వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కావాల్సి ఉంది. టీమిండియాకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే ఇప్పుడు ఏకంగా 8 మంది కరోనా బారిన పడటంతో భారత్-వెస్టిండీస్ మధ్య జరగాల్సిన సిరీస్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ తాజా పరిస్థితిని పరిశీలిస్తోంది. గురువారం ట్రైనింగ్‌కు వెళ్లే ముందు జట్టు సభ్యులకు మరోసారి కరోనా టెస్టులు చేయనున్నట్లు సమాచారం. ఒకవేళ పరిస్థితి ఆందోళనకరంగా మారితే.. సిరీస్ జరిగేది స్వదేశంలోనే కాబట్టి వేరే ఆటగాళ్లను సెలక్టర్లు ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Exit mobile version