Shardul Thakur: టీమిండియా పేస్ బౌలర్ శార్దూల్ ఠాకూర్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. ఒక్క ఓవర్‌తో టీమిండియా నుంచి మ్యాచ్‌ను అతడు దూరం చేశాడని నెటిజన్‌లు మండిపడుతున్నారు. ముఖ్యంగా శార్దూల్ ఠాకూర్ వేసిన 40వ ఓవర్‌లో న్యూజిలాండ్ బ్యాటర్ టామ్ లాథమ్ ఐదు బౌండరీలతో 25 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్‌లో తొలి బంతిని టామ్ లాథమ్ డీప్ బ్యాక్‌వార్డ్ దిశగా సిక్సర్ బాదాడు. రెండో బంతిని వైడ్ వేయగా.. ఎక్స్‌ట్రా బాల్‌ను బౌండరీ తరలించాడు. ఆ తర్వాత మరో మూడు బంతులను బౌండరీలుగా మలిచాడు. తీవ్ర ఒత్తిడికి గురైన శార్దూల్ ఠాకూర్ చివరి బంతిని మరో వైడ్ వేయగా.. మరో ఎక్స్‌ట్రా డెలివరీకి సింగిల్ తీసిన లాథమ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
Read Also: ఇప్పటివరకు ఆ పని చేయని ఒక్క మగాడు.. మహేష్ బాబు
40వ ఓవర్ వరకు బాగానే బౌలింగ్ చేసిన శార్దూల్ ఠాకూర్ ఒక్క ఓవర్‌తో అభిమానుల గుండెల్లో రాక్షసుడిగా మారిపోయాడు. ముఖ్యంగా 40వ ఓవర్‌లో శార్దూల్ ఒక బంతిని గంటకు 112 కిలోమీటర్ల వేగంతో బౌన్సర్‌గా వేశాడు. పైగా లెగ్ సైడ్ ఒక్క ఫీల్డర్‌ను పెట్టుకొని ఈ బాల్ వేయగా లాథమ్ సులభంగా బౌండరీ రాబట్టాడు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. శార్దూల్ ఒక్కడే ఈ తరహా బాల్స్ వేయగలడని చురకలు అంటిస్తున్నారు. 70 బంతులకు 77 పరుగులు చేసిన లాథమ్.. శార్దూల్ పుణ్యమా అని 76 బంతుల్లోనే సెంచరీ సాధించాడని నెటిజన్‌లు ట్రోల్ చేస్తున్నారు. కాగా ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును వీడిన నాటి నుంచి శార్దూల్‌కు దరిద్రం పట్టుకుందని, అతడు మునపటిలా బౌలింగ్ చేయలేకపోతున్నాడని కొందరు ఆరోపిస్తున్నారు.
Read Also: Manish Pandey: అప్పుడు నా కెరీర్ నాశనం చేశారు.. ఇప్పుడు శాంసన్ కెరీర్ నాశనం చేస్తున్నారు
