Team India History: చరిత్ర సృష్టించిన భారత్.. టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో టాప్ టీమ్!
- చరిత్ర సృష్టించిన భారత్
- టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో భారత్ టాప్
- వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి ప్రపంచ రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Top In Most Consecutive Wins T20 World Cup: ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్‌కప్‌లో విజయం సాధించడం అంత తేలిక కాదు. అందులోనూ వరుస విజయాలు సాధించడం ఎంతో కష్టం. పొట్టి ఫార్మాట్ కావడంతో ప్రతి మ్యాచ్‌లో ఫలితం అనూహ్యంగా మారే అవకాశం ఉంటుంది. అయినా కూడా భారత్ అద్భుత విజయాలు సాధిస్తోంది. కఠిన పరిస్థితుల్లో కూడా వరుస గెలుపులతో ఆధిపత్యం చాటిన జట్ల జాబితాలో ప్రస్తుతం టీమిండియా అగ్ర స్థానంలో నిలిచింది. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం.
2024 నుంచి 2026 మధ్య టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో భారత్ వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి ప్రపంచ రికార్డు సృష్టించింది. స్థిరమైన బ్యాటింగ్, కట్టుదిట్టమైన బౌలింగ్, మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్టు వ్యూహాలు.. ఈ మూడు అంశాలు భారత్ విజయ రహస్యం. టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో భారత్ బలమైన ప్రత్యర్థులను కూడా ఈజీగా ఓడించడం విశేషం. ఈ జాబితాలో రెండో స్థానంలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి. దక్షిణాఫ్రికా 2024లో వరుసగా 8 మ్యాచ్‌లు గెలిచింది. ఆస్ట్రేలియా 2022 నుంచి 2024 మధ్య 8 విజయాలు సాధించింది. ఈ రెండు జట్లు అత్యంత ప్రమాదకరమైన టీమ్‌లుగా గుర్తింపు పొందాయి.
Also Read
- Vaibhav Sooryavanshi: "ఇది నిరంకుశత్వం".. గంభీర్‌పై వైభవ్ సూర్యవంశీ కోచ్ ఫైర్..
- Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్‌లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
- Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
- Mohammad Kaif: రోహిత్, కోహ్లీ కాదు.. 2027 వరల్డ్ కప్ గెలవాలంటే భారత్‌కు ఇదే కీలకం..
Also Read: Daily Horoscope: శుక్రవారం రాశి ఫలాలు.. ఆ రాశి వారు అనుకున్నది నెరవేరుతుంది!
మూడో స్థానంలో ఇంగ్లండ్ సహా మరోసారి భారత్ ఉన్నాయి. ఇంగ్లాండ్ 2010–2012 మధ్య 7 మ్యాచ్‌లు గెలిచింది. భారత్ 2012–2014 మధ్య 7 విజయాలు నమోదు చేసింది. ఇది టీమ్ స్థిరత్వాన్ని చూపించే గణాంకంగా చెప్పొచ్చు. మొత్తంగా చూస్తే.. వరుస విజయాల రికార్డులు ఒక జట్టు ఫామ్, లోతైన బెంచ్ స్ట్రెంగ్త్, కెప్టెన్సీ నైపుణ్యం అన్ని కలిసి వచ్చినప్పుడు సాధ్యమవుతాయి. ప్రస్తుతం ఈ జాబితాలో భారత్ అగ్రస్థానంలో ఉండటం భారత క్రికెట్ ఆధిపత్యాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.
తాజావార్తలు
-
Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
-
Explainer: విదేశీ పేదోళ్ల ముందు.. మన ధనికులు కూడా వేస్ట్!
-
Vaibhav Sooryavanshi: “ఇది నిరంకుశత్వం”.. గంభీర్‌పై వైభవ్ సూర్యవంశీ కోచ్ ఫైర్..
ట్రెండింగ్
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!