శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా… తక్కువ పరుగులకే పరిమితమైంది. 43.1 ఓవర్లలో కేవలం 225 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయింది. మిడిల్ ఆర్డర్ పూర్తిగా విఫలం కావడంతో టీమిండియా తక్కువ స్కోర్ కే పరిమితమైంది. దీంతో ఆతిథ్య జట్టు శ్రీలంక 47 ఓవర్లలో 226 పరుగులు చేయాల్సి ఉంది. ఇక ఇండియా బ్యాటింగ్ వివరాల్లోకి వస్తే… పృథ్వీషా 49 పరుగులు, సంజు శాంసన్ 46 పరుగులు, సూర్యకుఆర్ యాదవ్ 40 పరుగులు టీమిండియాను ఆదుకున్నారు. ఇక అటు కెప్టెన్ శిఖర్ ధావన్ తో సహా మిగతా బ్యాట్స్ మెన్స్ ఘోరం విఫలమయ్యారు.
225 పరుగులకే కుప్పకూలిన టీమిండియా
