Site icon NTV Telugu

Team India Schedule: 2026లో టీమిండియాకు భారీ షెడ్యూల్.. అభిమానులకు పండగే!

Team India

Team India

2026 సంవత్సరంలో భారత క్రికెట్ జట్టు వన్డే ఫార్మాట్‌లో ఫుల్ బిజీగా ఉండనుంది. మొత్తం 21 వన్డే అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. హోం, విదేశీ సిరీస్‌లతో రూపొందిన షెడ్యూల్‌లో భారత్ పలు బలమైన జట్లతో తలపడనుంది. ముందుగా స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఆ వెంటనే అఫ్గానిస్తాన్‌తో హోం సిరీస్‌గా మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ రెండు సిరీస్‌లలో స్వదేశీ పరిస్థితుల్లో తమ బలాన్ని చాటుకునే భారత జట్టుకు మంచి అవకాశం.

న్యూజిలాండ్‌, అఫ్గానిస్తాన్‌ సిరీస్‌ల అనంతరం ఇంగ్లాండ్ పర్యటనకు భారత్ వెళ్లనుంది. అక్కడ మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. విదేశీ గడ్డపై జరిగే ఈ సిరీస్ టీమిండియాకు కీలక సవాలుగా మారనుంది. వేగవంతమైన పిచ్‌లపై బ్యాటర్లు, బౌలర్లు తమ నైపుణ్యాన్ని పరీక్షించుకోవాల్సి ఉంటుంది. ఆపై వెస్టిండీస్‌తో మూడు వన్డేల హోం సిరీస్‌ను ఆడనుంది. ఈ సిరీస్‌లో యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వొచ్చని అంచనా. న్యూజిలాండ్ గడ్డపై భారత్ మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఇది విదేశీ సిరీస్ కావడంతో జట్టుకు మరో పెద్ద పరీక్షగా నిలవనుంది.

Also Read: Rukmini Vasanth: ఒకే ఒక్క హిట్.. పాన్ ఇండియా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా రుక్మిణీ వసంత్‌!

ఇక శ్రీలంకతో భారత్ స్వదేశంలో మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఉపఖండ పరిస్థితుల్లో జరిగే ఈ సిరీస్ స్పిన్నర్లకు కీలకంగా ఉండనుంది. చివరగా బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. విదేశీ సిరీస్‌గా జరిగే ఈ మ్యాచ్‌లు ఆసియా ప్రత్యర్థిపై భారత జట్టు సత్తాను పరీక్షించనున్నాయి. మొత్తంగా 2026లో టీమిండియా 21 వన్డే మ్యాచ్‌లు ఆడుతూ అంతర్జాతీయ క్రికెట్‌లో బిజీగా ఉండనుంది. రాబోయే ఐసీసీ టోర్నీలకు సిద్ధమయ్యే దిశగా ఈ సిరీస్‌లు టీమిండియాకు ఎంతో కీలకంగా మారనున్నాయి.

Exit mobile version