NTV Telugu Site icon

టాటా మోటార్స్ కీల‌క నిర్ణ‌యం: ప‌త‌కాలు గెల‌వ‌ని వారికి ఖ‌రీదైన కార్లు బ‌హుమానం…

టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియా మొత్తం ఏడు ప‌త‌కాలు సాధించింది.  ఇందులో నాలుగు కాంస్యం, రెండు ర‌జతం, ఒక గోల్డ్ పత‌కం ఉన్న‌ది.  అయితే, కొన్ని విభాగాల్లో ఇండియా అద్భుత‌మైన ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచినా, చివ‌రి నిమిషంలో ప‌త‌కం చేజార్చుకున్న సంగ‌తి తెలిసిందే.  విమెన్ హాకీ టీమ్ ఆద్యంతం అద్భుత‌మైన ఆట‌ను ప్ర‌ద‌ర్శించినా చివ‌ర‌కు కాస్యం చేజార్చుకుంది. కానీ, ఆట‌తీరుతో కోట్లాది మంది హృద‌యాల‌ను గెలుచుకున్నారు.  వెయిట్ లిఫ్ట‌ర్ దీపికా పూనియా త‌దిత‌రులు తృతిటో కాంస్యం చేజార్చుకున్న సంగ‌తి తెలిసిందే.  వీరిని ప్రొత్స‌హించ‌డం కోసం టాటా మోటార్స్ సంస్థ ముందుకు వ‌చ్చింది.  త‌మ సంస్థ త‌యారు చేసిన టాటా ఆల్ట్రోజ్ కార్ల‌ను బ‌హుమ‌తిగా ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ది.  వారిలో ఉత్సాహాన్ని నింపితే రాబోయే ఒలింపిక్స్‌లో ప‌త‌కాలు సాధిస్తార‌ని టాటా మోటార్స్ పేర్కొన్న‌ది.  

Read: మ‌ళ్లీ ఆంక్ష‌లు మొద‌లు… ఆ రాష్ట్రంలో అడుగుపెట్టాలంటే…!!