మిథాలీరాజ్ బయోపిక్ పూర్తి చేసిన తాప్సీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవలే ‘రశ్మీ రాకెట్’ మూవీలో అథ్లెట్ గా నటించి, సినీ అభిమానుల మెప్పు పొందిన తాప్సీ పన్ను తాజాగా మిథాలీ రాజ్ బయో పిక్ షూటింగ్ పూర్తి చేసింది. భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ బయోపిక్ ను ‘శభాష్ మిథు’ పేరుతో శ్రీజిత్ ముఖర్జీ తెరకెక్కించాడు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ షెడ్యూల్స్ తారుమారు కావడంతో ఈ మూవీని డైరెక్ట్ చేయాల్సిన రాహుల్ ధోలాకియా ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో శ్రీజిత్ మెగాఫోన్ పట్టుకోవాల్సి వచ్చింది. మంగళవారం ఈ సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా తాప్సీ పన్ను హార్ట్ టచింగ్ కామెంట్ ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘ఎనిమిదేళ్ళ వయసులో నాకు ఓ కలను చూపించారు. ఏదో ఒకరోజు క్రికెట్ అనేది కేవలం జంటిల్మన్ ఆట మాత్రమే కాదని చెప్పారు. మనకూ ఓ టీమ్ ఉంటుందని, దానితో ఓ గుర్తింపు లభిస్తుందని తెలిపారు. ఉమెన్ ఇన్ బ్లూ, మేం కూడా త్వరలో మీ ముందుకు వస్తున్నాం… షూటింగ్ పూర్తయ్యింది. వరల్డ్ కప్ 2022ను ఎంజాయ్ చేసేందుకు సిద్ధంగా ఉండండి’ అని తాప్సీ అందులో పేర్కొంది. మరి లేడీ క్రికెటర్ మిథాలీ రాజ్ గా తాప్సీ ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
Also Read
- Ajinkya Rahane: రిటైర్మెంట్ వేళ రహానే సంచలనం.. గంభీర్‌కే నేరుగా హెచ్చరిక..
- Rohit Sharma Retirement: రోహిత్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన కైఫ్.. సెలెక్టర్లకు గట్టి సందేశమా..?
- ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
- Mitchell Marsh: ఐపీఎల్ స్టార్ ఇప్పుడు కావ్య మారన్ జట్టులో.. మిచెల్ మార్ష్ ఎంట్రీ..
తాజావార్తలు
-
Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
-
Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్‌పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!