Here Is A Reson for IND vs ENG Semi Final 2 Don’t Have Reserve Day: టీ20 ప్రపంచకప్ 2024లో సెమీస్ మ్యాచ్‌లకు సమయం ఆసన్నమైంది. సూపర్-8 దశలో టాప్‌లో నిలిచిన దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, భారత్, అఫ్గానిస్థాన్ జట్లు సెమీస్‌లో తలపడనున్నాయి. మొదటి సెమీస్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా-అఫ్గానిస్థాన్ జట్లు తలపడనుండగా.. రెండో సెమీస్‌లో భారత్-ఇంగ్లండ్ ఢీకొట్టనున్నాయి. ఫైనల్ లక్ష్యంగా అన్ని టీమ్స్ బరిలోకి దిగనున్నాయి. అయితే తొలి సెమీస్‌కు రిజర్వ్‌డే ఉండగా.. రెండో సెమీస్‌కు ఆ సౌకర్యం లేదు. దీంతో టీమిండియాకు ఎందుకు రిజర్వ్ డే లేదని ఫ్యాన్స్ చర్చించుకొంటున్నారు. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందో చూద్దాం.
దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య ట్రినిడాడ్ వేదికగా గురువారం (భారత కాలమానం ప్రకారం జూన్ 27) ఉదయం 6 గంటలకు తొలి సెమీఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు శుక్రవారంను రిజర్వుడేగా ఉంచారు. వర్షం కారణంగా షెడ్యూల్ సమయంలో మ్యాచ్ పూర్తికాకపోతే.. అదనంగా మరో 60 నిమిషాలు కేటాయించారు. రిజర్వ్‌డే రోజు 190 నిమిషాల అదనపు సమయం కూడా కల్పించారు. షెడ్యూల్ రోజున అవసరమైతే ఓవర్లు కుదించి అయినా.. మ్యాచ్‌ను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. వర్షం కారణంగా అది కూడా సాధ్యంకాని పక్షంలో రిజర్వ్ డేకు తీసుకెళతారు. షెడ్యూల్ రోజున టాస్ వేసాక మరోసారి వేయరు. ఇక వర్షం కారణంగా మ్యాచ్ అసలే జరగకపోతే టాప్ ర్యాంక్ జట్టు ఫైనల్స్‌కు వెళుతుంది.
Also Read: Gold Rates Today: మగువలకు ‘గోల్డెన్’ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు!
భారత్, ఇంగ్లండ్ రెండో సెమీస్ గురువారం రాత్రి 8 గంటలకు (భారత కాలమానం ప్రకారం) గయానా వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. కానీ ఆ రోజున ఏకంగా 250 నిమిషాల అదనపు సమయం కేటాయించారు. రిజర్వ్ డే ఎందుకు లేదన్న అంశంపై ఐసీసీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు కానీ.. అందుకు కారణం మాత్రం సమయమే అని చెప్పక్కర్లేదు. తొలి సెమీస్ విండీస్ కాలమానం ప్రకారం జూన్ 26 రాత్రి 8.30కి (భారత కాలమానం ప్రకారం జూన్ 27 ఉదయం 6 గంటలు) మొదలవుతుంది. ఇక రెండో సెమీస్ లోకల్ టైమ్ ప్రకారం జూన్ 27 ఉదయం 10.30కి మొదలవుతుంది. భారత కాలమానం ప్రకారం జూన్ 27 రాత్రి 8 గంటలు ఆరంభమవుతుంది. ఇక ఫైనల్ మ్యాచ్ విండీస్ టైమ్ ప్రకారం జూన్ 29 ఉదయం 10.30 (భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలు) మొదలవుతుంది. రెండో సెమీస్‌కు రిజర్వ్ డే కేటాయిస్తే.. ఫైనల్స్ ఆడే జట్టుకు కనీసం 24 గంటల సమయం కూడా ఉండదు. ఈ కారణంతోనే రిజర్వ్‌డేను రెండో సెమీస్‌కు కేటాయించలేదు.