Site icon NTV Telugu

హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ అదిరే రికార్డు

టీ20 వరల్డ్‌ కప్‌లో భాగంగా జరుగుతున్న నమీబియాతో ఆడుతున్న మ్యాచ్‌లో టీం ఇండియా స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ అద్భుతమైన ఫీట్‌ను సాధించాడు. అంతర్జాతీయT20 క్రికెట్లో 3వేలకు పైగా పరుగులను సాధించిన మూడో ప్లేయర్‌గా నిలిచాడు.రోహిత్ ఈ మ్యాచ్‎లో 37 బంతుల్లో 56(7 ఫోర్లు, 2సిక్స్‎లు) పరుగులు చేశాడు.

టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో అతని స్థానంలో రోహిత్ శర్మ ఎంపిక చేసే అవకాశలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 108 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు హిట్‌ మ్యాన్‌. ఇక రోహిత్‌ కన్నా ముందు విరాట్‌ కోహ్లీ- 3,227 మార్టిన్‌గప్తీల్‌ (న్యూజిలాండ్‌)- 3115, మాత్రమే ఈ రికార్డును అందుకున్నారు. ఇక టీ20లలో నాలు గు సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌ శర్మ నిలిచాడు.

Exit mobile version