NTV Telugu Site icon

Premgi Marriage: 45 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న ప్రముఖ కమెడియన్!

Premgi Amaren Marriage

Premgi Amaren Marriage

Actor Premgi Amaren Wedding: ప్ర‌ముఖ త‌మిళ కమెడియన్, గాయకుడు ప్రేమ్‌జీ అమరన్‌ 45 ఏళ్ల వయసులో ఓ ఇంటివాడయ్యారు. తన స్నేహితురాలైన ఇందును పెళ్లి చేసుకున్నారు. చెన్నైలో ఆదివారం (జూన్ 9) ఉదయం జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాలు, కొద్దిమంది అతిథులు హాజరయ్యారు. ప్రేమ్‌జీ సోదరుడు, దర్శకుడు వెంకట్‌ ప్రభు.. హీరోలు జై, వైభవ్‌ సహా మరికొందరు ప్రేమ్‌జీ వివాహంలో సందడి చేశారు. ఇందుకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సినీ సెలబ్రిటీస్‌, అభిమానులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Also Read: Nayanthara-Vignesh Shivan: పదేళ్ల నయనతార.. రెండేళ్ల విక్కీ-నయన్!

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా తమ్ముడు గంగై అమరన్‌ (డైరెక్టర్‌ కమ్ మ్యూజిక్‌ డైరెక్టర్‌) కుమారుడే ఈ ప్రేమ్‌జీ. పలు డబ్బింగ్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కూడా అలరించారు. రాక్షసుడు, మానాడు, కస్టడీ తదితర చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. ప్రేమ్‌జీ మంక‌త్తా, మాస్, గోవా, స‌రోజా, చెన్నై 600028, బిర్యానీ సినిమాల‌తో తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేమ్‌జీ మ్యూజిక్‌ డైరెక్టర్‌, సింగర్‌గానూ రాణిస్తున్నారు. వైభవ్‌ హీరోగా తెరకెక్కిన కాస్కో చిత్రంకు ప్రేమ్‌జీనే సంగీతం అందించారు.

Show comments