NTV Telugu Site icon

USA vs SA: నేటి నుంచే సూపర్‌-8 మొదలు.. దక్షిణాఫ్రికాతో అమెరికా ఢీ!

United States Vs South Africa

United States Vs South Africa

United States vs South Africa Super 8 Prediction: టీ20 ప్రపంచకప్‌ 2024లో సూపర్‌-8 సమరానికి సమయం ఆసన్నమైంది. బుధవారం జరిగే తొలి మ్యాచ్‌లో అమెరికాతో దక్షిణాఫ్రికా తలపడనుంది. ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్, డిస్నీ+హాట్‌స్టార్‌లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. గ్రూప్ దశలో సత్తాచాటిన పసికూన అమెరికా అదే ఫామ్ కంటిన్యూ చేయాలని చూస్తోంది. గ్రూప్‌ దశలో అజేయంగా నిలిచిన దక్షిణాఫ్రికా విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.

మెగా టోర్నీలో ఇప్పటివరకు దక్షిణాఫ్రికా అజేయంగా ఉన్నప్పటికీ.. బ్యాటర్ల ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. డికాక్, క్లాసెన్, స్టబ్స్, మిల్లర్‌ లాంటి హిట్టర్లున్నప్పటికీ.. గ్రూప్‌ దశలో దక్షిణాఫ్రికా ఒక్కసారి కూడా 120 దాటలేకపోయింది. చివరి మ్యాచ్‌లో పసికూన నేపాల్‌పై ఒక్క పరుగు తేడాతో గట్టెక్కింది. గ్రూప్‌-2లో ఇంగ్లండ్, వెస్టిండీస్‌ లాంటి పటిష్ట జట్లతో తలపడాల్సి ఉండడంతో బ్యాటింగ్‌లో పుంజుకోవాలని దక్షిణాఫ్రికా ఆశిస్తోంది. ఇక బౌలింగ్‌ విభాగంలో అన్రిచ్ నోకియా సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. నోకియా సహా బార్ట్‌మన్, రబాడ, యాన్సెన్‌లను ఎదుర్కోవడం అమెరికాకు పెద్ద సవాలే.

Also Read: Heavy rainfall warning: తెలుగు రాష్ట్రాలతో సహా 19 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

గ్రూప్ దశలో అమెరికా అద్భుతంగా ఆడింది. పాకిస్థాన్‌ వంటి మేటి జట్టును మట్టికరిపించిన అమెరికా.. టీమిండియాను కూడా ఓ దశలో వణికించింది. దాంతో రెట్టించిన ఆత్మవిశ్వాసంతో సూపర్‌-8లో బరిలోకి దిగుతోంది. దక్షిణాఫ్రికాకు అమెరికా గట్టి సవాలు విసురుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. బ్యాటర్లు ఆరోన్‌ జోన్స్, గౌస్‌ రాణిస్తున్నారు. బౌలర్లు హర్మీత్‌ సింగ్, కెంజిగె, నేత్రావల్కర్‌లు అమెరికాకు కీలకం.

Show comments