NTV Telugu Site icon

T20 World cup 2024 : తొలిసారి ఐసీసీ ఫైనల్స్ కు చేరిన దక్షిణాఫ్రికా..

Sa Vs Afg Co

Sa Vs Afg Co

T20 World cup 2024 : టి20 వరల్డ్ కప్ 2024 లో భాగంగా నేడు జరిగిన మొదటి సెమి ఫైనల్లో దక్షిణాఫ్రికా (South Africa) , ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) తరౌబ వేదికగా తలపడ్డాయి. ఈ మ్యాచ్లో మొదట ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేయగా కేవలం 11.5 ఓవర్లలో 56 పరుగులకు కుప్ప కూలింది. దింతో దక్షిణాఫ్రికా బౌల్లర్స్ దెబ్బకి ఆఫ్ఘనిస్తాన్ ఏ పరిస్థితుల్లో కూడా ఎదురుకోలేకపోయింది. ఇక మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్స్ లో ఒక్కరు మాత్రమే రెండు అంకెల స్కోరుని చేరుకున్నాడు. ఒమార్జై ఒక్కడే 10 పరుగులను చేసి అవుట్ అవ్వగా.. ఇన్నింగ్స్ లో ఎక్స్ట్రాలు 13 అత్యధిక స్కోర్ గా ఉంది. అంటే ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్స్ అంత కలిపి కేవలం 43 పరుగులు మాత్రమే చేసారు. ఈ ఇన్నింగ్స్ లో ముగ్గురు బ్యాట్స్మెన్స్ డక్ అవుట్ అయ్యారు. ఇక మరోవైపు దక్షిణాఫ్రికా బౌలర్లు విషయానికి వస్తే.. మార్కో జాన్సెన్, తబ్రైజ్ శంసిలు చెరో మూడు వికెట్లు.. కాగిసో రబడా, అన్రిచ్ నోర్ట్జే చెరో రెండు వికెట్లు తీసుకొని ఆఫ్ఘనిస్తాన్ పతనానికి కారణం అయ్యారు.

Kalki 2898 AD – Devara : కల్కి లో దేవర.. ఉహించనేలేదుగా..

ఇక తక్కువ స్కోర్ టార్గెట్ చేసేందుకు బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా కేవలం 8.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 60 పరుగులతో మొదటిసారి ఐసీసీ టోర్నమెంట్లో ఫైనల్ కు చేరుకుంది. మ్యాచ్లో కేవలం 16 పరుగులు ఇచ్చి మూడు టికెట్లు తీసుకున్న మార్కో జాన్సన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లో డికాక్ కేవలం 5 పరుగులు చేసి వెనుతిరిగిగ మిగతా లాంచనాన్ని హెన్రిక్స్, దక్షిణాఫ్రికా కెప్టెన్ దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్కమ్ పూర్తి చేశారు. ఆఫ్ఘనిస్తాన్ బౌల్లర్స్ లో ఫరుకి ఒక వికెట్ సాధించాడు. టీ20 క్రికెట్ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది. తొలిసారి ఆ జట్టు ఫైనల్స్ చేరింది. 2007లో మొదటి టీ20 ప్రపంచకప్ దక్షిణాఫ్రికా వేదికగా జరగ్గా.. ఆ సంవత్సరం భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పటివరకు 8 సార్లు టీ20 ప్రపంచకప్ జరగ్గా దక్షిణాఫ్రికా ఒక్కసారి కూడా ఫైనల్స్ చేరుకోలేదు. 2024లో సెమీఫైనల్స్‌లో ఆప్ఘానిస్తాన్‌పై ఘన విజయం సాధించి ఫైనల్స్ చేరింది. ఈరోజు రాత్రి ఇంగ్లాడ్, భారత్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్స్ మ్యాచ్‌లో విజేతతో దక్షిణాఫ్రికా ఫైనల్స్ ఆడనుంది.

Kalki 2898 AD Public Talk: కల్కి 2898 AD పబ్లిక్ టాక్.. ఆ సీన్లు ఊహించలేం.. జీవితంలో ఇలాంటి సినిమా చూడలే