NTV Telugu Site icon

T20 World Cup 2024: నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్.. ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ ఛీటింగ్..

T20 World Cup 2024 Copy

T20 World Cup 2024 Copy

T20 World Cup 2024: టి20 ప్రపంచ కప్ 2024 లో నేడు జరిగిన బంగ్లాదేశ్ – ఆఫ్గనిస్తాన్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయాన్ని నమోదు చేసుకొని మొదటిసారి వరల్డ్ కప్ సెమిఫైనల్ కు చేరుకుంది. బంగ్లాదేశ్ డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మొదటి గ్రూప్ రన్నర్స్ గా ఆఫ్గనిస్తాన్ సెమిస్లో అడుగుపెట్టింది. దీంతో మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్లు ఇంటి దారి పట్టాయి. ఇక మ్యాచ్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు వారి భావోద్వేగాలను అదుపులో ఉంచుకోకపోవడంతో క్రికెట్ అభిమానులకు కావాల్సినంత మజాను అందించింది.

Bihar: పానీపూరి విషయంలో అత్త-కోడలు మధ్య గొడవ.. చివరికి ఏమైందంటే..?

ఇకపోతే మ్యాచ్ జరిగే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ గుల్బాదిన్ నైబ్ వారి విజయం కోసం క్రీడా స్పూర్తికి విరుద్దంగా చేసాడు. ఈ విషయంలో అంపైర్లతో పాటు ప్రత్యర్థి ఆటగాళ్లను సహితం అతను ఛీటింగ్ చేశాడు. గుల్బాదిన్ నైబ్‌ పై సోషల్ మీడియా వేదికగా అనేక జోకులు పేలుతున్నాయి. ఇక మాజీ క్రికెటర్లు అయితే చాలామంది అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసారు కూడా. మరికొందరు తమదైన శైలిలో జోకులు కూడా పేల్చుతున్నారు. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో గుల్బాదిన్ నైబ్‌ గాయమైనట్లుగా నటించాడు. ఇక విషయం అఫ్గాన్ కోచ్ జోనాథన్ ట్రాట్ సూచనలతోనే గుల్బాదిన్ నైబ్ ఇలా చేసాడని, అతని సలహాలను అందుకునేందుకే గాయమైనట్లు నటించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ స్లిప్‌ లో ఫీల్డింగ్‌ చేస్తున్న గుల్బాదిన్ నైబ్ ఒక్కసారిగా గ్రౌండ్ లో కుప్పకూలిపోయాడు.

Afghanistan In Semis : అఫ్గానిస్తాన్ కెప్టెన్ కు విదేశాంగ మంత్రి ఫోన్‌.. వీడియో వైరల్..

తొడ కండరాలు పట్టేసాయని.., నొప్పితో బాధపడుతున్నానని తెలపగా., బయటి నుంచి ఫిజియోలు మైదానంలోకి వచ్చారు. వారితో పాటు టీమ్ 12వ ప్లేయర్‌ ను కోచ్ జొనాథన్ ట్రాట్ మైదానంలోకి పంపాడు. అతనితో కోచ్ సూచనలను జట్టుకు చేరవేసాడు. అయితే గుల్బాదిన్ నైబ్ గాయం డ్రామా కారణంతో మ్యాచ్ కొద్దీసేపు ఆగిపోగా.. ఆ వెంటనే వర్షం అంతరాయం కలిగించింది. ఆ తర్వాత చివరకు ఆఫ్ఘనిస్తాన్ విజయం లాంఛనమైంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.