NTV Telugu Site icon

South Africa Record: ఒకటి, రెండు కాదు.. ఏకంగా ఐదు సార్లు ఒక్క పరుగుతో గట్టెక్కిన దక్షిణాఫ్రికా!

South Africa Record

South Africa Record

Lowest targets successfully defended by South Africa in T20Is: టీ20 ప్రపంచకప్‌ 2024లో భాగంగా కింగ్స్‌టౌన్ వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో పసికూన నేపాల్‌పై దక్షిణాఫ్రికా ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ప్రొటీస్ నిర్ణీత 20 ఓవరల్లో ఏడు వికెట్లకు 115 పరుగులు చేయగా.. నేపాల్‌ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. నేపాల్ విజయానికి చివరి బంతికి రెండు పరుగులు అవసరం అవ్వగా.. గుల్షాన్ జా రనౌటవ్వడంతో దక్షిణాఫ్రికా ఒక్క పరుగుతో గట్టెక్కింది. అయితే ఒక్క పరుగు తేడాతో గెలవడం దక్షిణాఫ్రికాకు ఇదే మొదటిసారి కాదు.

టీ20 ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికా ఏకంగా ఐదు సార్లు ఒక్క పరుగుతో విజయం సాధించింది. దాంతో టీ20ల్లో ఒక్క పరుగు తేడాతో అత్యధిక సార్లు విజయం సాధించిన జట్టుగా ప్రొటీస్ రికార్డులో నిలిచింది. ఈ జాబితాలో ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, ఐర్లాండ్, కెన్యా జట్లు రెండో స్థానంలో ఉన్నాయి. ఈ టీమ్స్ రెండు సార్లు ఒక్క పరుగు తేడాతో గెలిచాయి. టీ20 ప్రపంచకప్‌లో ఒక్క పరుగుతో అత్యధిక సార్లు గెలిచిన రికార్డు కూడా దక్షిణాఫ్రికాదే. 2024లో నేపాల్‌తో, 2009లో న్యూజిలాండ్‌పై ప్రొటీస్ ఒక్క పరుగు తేడాతో గెలిచింది. టీ20 ప్రపంచకప్‌లో భారత్ కూడా రెండుసార్లు (2012లో దక్షిణాఫ్రికాపై, 2016లో బంగ్లాదేశ్‌పై) ఒక్క పరుగు తేడాతో గట్టెక్కింది.

Also Read: KCR: కమిషన్లు వేయకూడదన్న విషయం ప్రభుత్వంకు తెలియదా?: కేసీఆర్‌

దక్షిణాఫ్రికా మరో రికార్డును కూడా ఖాతాలో వేసుకుంది. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో రెండోసారి తక్కువ స్కోరు‌ను డిఫెండ్ (కాపాడుకున్న) చేసిన జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 114 పరుగులను కాపాడుతున్న ప్రొటీస్.. తాజాగా నేపాల్‌పై 116 స్కోరును కాపాడుకుంది. అంతకుముందు 120 పరుగులను రెండుసార్లు, 124 పరుగులను ఓసారి డిఫెండ్ చేసుకుంది.