NTV Telugu Site icon

IND vs AUS: రోహిత్‌ శర్మ సంచలన ఇన్నింగ్స్‌.. ఆస్ట్రేలియాపై భారత్‌ ఘన విజయం!

Rohit, Axar

Rohit, Axar

Rohit Sharma 92 Help India into T20 World Cup 2024 Semis: టీ20 ప్రపంచకప్‌ 2024లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. సూపర్‌-8 చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై గెలిచిన టీమిండియా.. అజేయంగా సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. భారత్ నిర్ధేశించిన 206 పరుగుల ఛేదనలో ఆసీస్‌ 7 వికెట్లకు 181 పరుగులే చేసింది. ట్రావిస్‌ హెడ్‌ (76; 43 బంతుల్లో 9×4, 4×6) మరోసారి భారత్‌ను బయపెట్టగా.. మిచెల్‌ మార్ష్‌ (37; 28 బంతుల్లో 3×4, 2×6) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్‌ (2/24), అర్ష్‌దీప్‌ సింగ్ (3/37)లు రాణించారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్లకు 205 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత్‌ ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ఆరంభించింది. 2 ఓవర్లలో విరాట్ కోహ్లీ (0) వికెట్‌ కోల్పోవడమే కాదు.. కేవలం 6 పరుగులే చేసింది. దాంతో భారత్‌కు ఇబ్బందులు తప్పవనిపించింది. వికెట్ పడినా రోహిత్‌ శర్మ (92; 41 బంతుల్లో 7×4, 8×6) చెలరేగిపోయాడు. స్టార్క్‌ వేసిన మూడో ఓవర్లో 28 పరుగులు రాబట్టిన రోహిత్‌.. ఆ తర్వాత అస్సలు తగ్గలేదు. రోహిత్ జోరుతో 9వ ఓవర్లోనే భారత్‌ 100 దాటేసింది. ఫామ్‌లో ఉన్న రిషబ్ పంత్‌ (15) విఫలమైనా.. సూర్యకుమార్‌ (31; 16 బంతుల్లో 3×4, 2×6) మెరిశాడు.రోహిత్‌ సెంచరీ లాంఛనమే అనుకుంటుండగా.. స్టార్క్‌ అతడికి చెక్‌ పెట్టాడు. శివమ్‌ దూబె (28; 22 బంతుల్లో 2×4, 1×6), హార్దిక్‌ పాండ్య (27 నాటౌట్‌; 17 బంతుల్లో 1×4, 2×6) మెరుపులు తోడవడంతో భారత్ భారీ స్కోర్ చేసింది.

Also Read: Atishi Hunger Strike: నిరాహారదీక్ష చేస్తున్న మంత్రి అతిషి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలింపు

ఛేదనలో ఆస్ట్రేలియా గట్టిగానే ప్రయత్నించింది. డేవిడ్ వార్నర్‌ (6)ను అర్ష్‌దీప్‌ తొలి ఓవర్లోనే ఔట్‌ చేసినా.. హెడ్‌కు జతకలిసిన మార్ష్‌ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఆరంభంలోనే ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్న మార్ష్‌.. భారీ షాట్లు ఆడాడు. మరో ఎండ్‌లో హెడ్‌ రెచ్చిపోయాడు. దాంతో పవర్‌ప్లేలో 65/1తో ఆసీస్‌ పటిష్ట స్థితిలో నిలిచింది. సహచర బౌలర్లు ధారాళంగా పరుగులిస్తున్న సమయంలో కుల్దీప్ పొదుపుగా బౌలింగ్‌ చేసి ఆసీస్‌ బ్యాటర్లకు కళ్లెం వేశాడు. ఈ సమయంలో బౌండరీ వద్ద అక్షర్‌ పటేల్‌ పట్టిన అద్భుత క్యాచ్‌కు మార్ష్‌ ఔట్ అయ్యాడు. కానీ ఓ ఎండ్‌లో హెడ్‌ మాత్రం విధ్వంసాన్ని కొనసాగించాడు. మరోవైపు వికెట్స్ పడుతుండడంతో హెడ్‌ కూడా పెవిలియన్ చేరాడు. మ్యాక్స్‌వెల్‌ (20), స్టాయినిస్‌ (2), వేడ్‌ (1), డేవిడ్‌ (15)లు విఫలమయ్యారు.