NTV Telugu Site icon

T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో మొదటి వికెట్‌.. టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి టీమ్ ఇదే!

T20 World Cup 2024 Trophy

T20 World Cup 2024 Trophy

Oman Out From T20 World Cup 2024: యూఎస్‌ఏ, వెస్టిండీస్‌ వేదికలుగా రసవత్తరంగా సాగుతున్న ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్‌ 2024లో మొదటి వికెట్‌ పడింది. మెగా టోర్నీ గ్రూప్‌-బి నుంచి పసికూన ఒమన్‌ నిష్క్రమించింది. ఆదివారం (జూన్‌ 9) స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోవడంతో.. ఒమన్‌ అధికారికంగా ప్రపంచకప్‌ నుంచి వైదొలిగింది. దాంతో మెగా టోర్నీ నుంచి నిష్క్రమించిన మొదటి జట్టుగా ఒమన్‌ నిలిచింది.

టీ20 ప్రపంచకప్‌ 2024లో ఇప్పటివరకు ఒమన్‌ మూడు మ్యాచ్‌లు ఆడగా.. మూడింటిలోనూ ఓడింది. నమీబియా, ఆస్ట్రేలియా, స్కాట్లాండ్‌లపై ఒమన్‌ ఓడింది. దాంతో ఒమన్‌ సూపర్‌-8కు అర్హత సాధించకుండానే ఇంటిదారి పట్టింది. ఇక నామమాత్రమైన చివరి మ్యాచ్ జూన్‌ 13న ఇంగ్లండ్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా ఒమన్‌ టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. న్యూజీలాండ్, పాకిస్తాన్, ఇంగ్లండ్, శ్రీలంకలు కూడా గ్రూప్ స్టేజ్ దాడటం కష్టంగానే ఉంది.

Also Read: IND vs PAK: కావాలనే చేశాడు.. మా టీమ్ ఓటమికి ప్రధాన కారణం అతడే: సలీమ్

ఆదివారం ఆంటిగ్వా వేదికగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఒమన్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ప్రతిక్‌ అథవాలే (54) అర్ద సెంచరీ చేశాడు. లక్ష్య ఛేదనలో స్కాట్లాండ్‌ 13.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. బ్రాండెన్‌ మెక్‌ముల్లెన్‌ (61 నాటౌట్‌), జార్జ్‌ మున్సే (41) చెలరేగారు.