NTV Telugu Site icon

Ind vs Canada: మ్యాచ్ వర్షార్పణం.. సూపర్ 8 లోకి టీమిండియా..

Match

Match

ఫ్లోరిడా లోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్‌లో తడి అవుట్‌ ఫీల్డ్ పరిస్థితుల కారణంగా భారత్ మరియు కెనడా మధ్య ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టి 20 ప్రపంచ కప్ మ్యాచ్ ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దు అయ్యింది. దాంతో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ గ్రూప్ దశలో అజేయంగా నిలిచి సూపర్ 8 దశలో టోర్నీ ఫేవరెట్‌ గా అడుగు పెట్టింది. చాలా సేపటి కిందనే వర్షం ఆగిపోయినప్పటికీ, ఔట్ ఫీల్డ్ పరిస్థితులు స్టేడియంలో బాగాలేవు. అందువల్ల రెండుసార్లు తనిఖీలు చేసినప్పటికీ, ఆన్ ఫీల్డ్ అంపైర్లు రిచర్డ్ కెటిల్‌బరో, షర్ఫుద్దౌలా గేమ్ ఆడలేమని నిర్ణయించుకున్నారు. దింతో టాస్ కూడా లేకుండానే మ్యాచ్ ను రద్దు చేసారు.

Cm Revanth Reddy: మంత్రులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

మూడు విజయాలు, ఒక మ్యాచ్ ఫలితం లేకుండా టీమిండియా గ్రూప్ Aలో అగ్రస్థానంలో నిలిచింది. దింతో +1.137 NRR వద్ద ఏడు పాయింట్లు సాధించింది. మరోవైపు, కెనడా మూడు పాయింట్లతో -0.493 వద్ద ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. జూన్ 20న బార్బడోస్‌ లోని కెన్సింగ్‌టన్ ఓవల్‌ లోని బ్రిడ్జ్‌టౌన్‌ లో జరిగే సూపర్ 8 మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో భారత్ తదుపరి మ్యాచ్ ఆడనుంది. మ్యాచ్ రాత్రి 8:00 కి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత, మెన్ ఇన్ బ్లూ గత సంవత్సరం వన్డే ప్రపంచ కప్‌లో ఫైనల్‌ లో ఓటమిని అందించిన ఆస్ట్రేలియాతో కూడా తలపడుతుంది.