Site icon NTV Telugu

నాయకత్వమనేది గౌరవం: విరాట్‌ కోహ్లీ

టీం ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీ నుంచి దిగిపోవడంపై స్పందించారు. ఈ సందర్భంగా విరాట్ మాట్లాడుతూ నాయకత్వ మనేది గౌరవమని, నాయకత్వం మరొకరి ఒప్పగించడంతో ఉపశమ నం లభించిందన్నారు. గతకొంత కాలంగా విరామం లేని క్రికెట్‌ ఆడు తున్నామని విరాట్‌ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా కెప్టెన్‌గా తన ఆఖ రి మ్యాచ్‌లో ఎందుకు బ్యాటింగ్‌ చేయలేదో వివరించాడు. నా పని భా రం పర్యవేక్షించుకునేందుకు ఇదే సరైన సమయమనిపించింది, ఆరే డేళ్లుగా ఎక్కువ పనిభారం పనిభారం అనుభవించా. ఒత్తిడిని ఫీల య్యాను, కానీ మేం కోరుకున్న ఫలితం దక్కలేదు. కానీ మేం మంచి క్రికెట్‌ ఆడాం టీ20 క్రికెట్‌లో కొద్ది తేడాతోనే ఓడిపోతుంటాం. తొలి రెండు మ్యాచ్‌లో మేం తొలి రెండు ఓవర్లు దూకుడుగా ఆడలేకపోయామన్నారు.

మేం కఠినమైనా గ్రూప్‌లో ఉన్నామన్నారు. ఆటగాళ్లందరికి కృతజ్ఞతలు. గత కొంత కాలంగా వారు డ్రెసింగ్‌ రూంలో ఆహ్లాదక రమైన వాతావరణాన్ని సృష్టించారు. టీంఇండియా డ్రెస్సింగ్‌ రూం లోకి రావడాన్ని ప్రేమించారు. కెప్టెన్సీ నుంచి దిగిపోయినా నా ఆట తీరులో ఎలాంటి మార్పు ఉండదని విరాట్‌ పేర్కొన్నాడు. ఈ ప్రపంచ కప్‌లో సూర్యకుమార్‌కు ఎక్కువ గేమ్‌ టైం దొరకలేదు. అతడికి ఇదో మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుందని రోహిత్‌ అవుట్‌ అయిన వెంటనే నేను బ్యాటింగ్‌కు రాలేదని విరాట్‌ కోహ్లీ వివరించాడు.

Exit mobile version