NTV Telugu Site icon

IND vs USA: అదే మా కొంపముంచింది: ఆరోన్ జోన్స్

Aaron Jones

Aaron Jones

Aaron Jones on USA Defeat vs IND: బ్యాటింగ్‌లో 10-15 పరుగులు తక్కువ చేయడమే తమ ఓటమిని శాసించిందని అమెరికా కెప్టెన్ ఆరోన్ జోన్స్ తెలిపాడు. తమ బౌలింగ్ యూనిట్ గురించి చాలా గర్వపడుతున్నానన్నాడు. మా తప్పిదాలను తెలుసుకొని పుంజుకుంటాం అని జోన్స్ ధీమా వ్యక్తం చేశాడు. అమెరికా రెగ్యులర్ కెప్టెన్ మొనాంక్ పటేల్ గాయపడడంతో ఆరోన్ జోన్స్ జట్టు బాధ్యతలు అందుకున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్‌ 2024 గ్రూప్‌-ఏలో భాగంగా బుధవారం టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో అమెరికా 7 వికెట్ల తేడాతో ఓడింది.

మ్యాచ్ అనంతరం అమెరికా తాత్కాలిక కెప్టెన్ ఆరోన్ జోన్స్ మాట్లాడుతూ… ‘మేం బ్యాటింగ్‌లో 10-15 పరుగులు తక్కువగా చేశాం. 130 పరుగులు చేసుంటే.. కఠిన లక్ష్యంగా ఉండేది. ఆటలో కొన్నిసార్లు ప్రతికూల ఫలితాలు రావడం సాధారణమే. మా ప్లేయర్స్ చాలా క్రమ శిక్షణతో ఆడారు. ముఖ్యంగా మా బౌలింగ్ యూనిట్ పట్ల గర్వపడుతున్నా. మా ఆటగాళ్ల ప్రదర్శనతో సంతోషంగా ఉంది. మేము కోరుకున్నది ఇదే. యూఎస్‌ఏ క్రికెట్‌ను ఆస్వాదిస్తోంది. మా ఓటమిపై సమీక్షించుకుంటాం. మా తప్పిదాలను తెలుసుకొని బలంగా తిరిగి వస్తాము’ అని అన్నాడు.

Also Read: IND vs USA: ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ గెలిచాం: రోహిత్

‘ఈ వికెట్ చాలా కష్టంగా ఉంది. సీమ్ బౌలింగ్‌కు బాగా అనుకూలంగా ఉంది. అందుకే స్పిన్నర్లతో బౌలింగ్ చేయంచలేదు. మా కెప్టెన్ మోనాంక్ పటేల్ చివరి మ్యాచ్‌కు అదుబాటులోకి వస్తాడు. అతనికి చిన్న గాయమే అయింది’ అని ఆరోన్ జోన్స్ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన యూఎస్ఏ 20 ఓవర్లలో 8 వికెట్లకు 110 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్యాన్ని భారత్ 18.2 ఓవర్లలో 3 వికెట్స్ కొల్పోయి 111 పరుగులు చేసి గెలుపొందింది.