NTV Telugu Site icon

T20 World Cup 2024: ప్రపంచకప్ జట్టును ప్రకటించని పాకిస్థాన్.. కారణం ఏంటంటే?

Pakistan Team

Pakistan Team

జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుంది. మెగా టోర్నీలో పాల్గొనే జట్లను ప్రకటించేందుకు మే1ని ఐసీసీ డెడ్‌లైన్‌గా విధించింది. గడువు లోగా న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, భారత్, దక్షిణాఫ్రికా, ఆఫ్గనిస్తాన్ లాంటి జట్లు తమ ప్రపంచకప్ టీంలను వెల్లడించాయి. అయితే గడువు ముగిసినా.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం తమ జట్టును ప్రకటించలేదు. ఆటగాళ్ల గాయాల కారణంగానే పాకిస్థాన్ జట్టును ఇంకా జట్టును ప్రకటించలేదట.

తమ ఆటగాళ్లు గాయాలతో బాధపడుతుండటంతోనే టీ20 ప్రపంచకప్ 2024 కోసం జట్టు ఎంపిక ఆలస్యం అవుతుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వర్గాలు మీడియాకు తెలిపాయి. మహమ్మద్ రిజ్వాన్, ఆజామ్ ఖాన్, ఇర్ఫాన్ ఖాన్, హారిస్ రౌఫ్ లాంటి స్టార్ ప్లేయర్స్ ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నారట. పొట్టి ప్రపంచకప్ ముందు ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌ల్లో వారి వ్యక్తిగత ప్రదర్శన ఆధారంగా టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయాలని పీసీబీ సెలెక్టర్లు భావిస్తున్నారట.

Also Read: SHR vs RR: ప్లేఆఫ్స్‌ రేసు రసవత్తరం.. సొంతగడ్డపై రాజస్థాన్‌ను సన్‌రైజర్స్‌ అడ్డుకునేనా?

‘పాకిస్థాన్ టీం ప్రకటన ఆలస్యం కావడం పెద్ద విషయం కాదు. మే 24 వరకు ఎవరి అనుమతి లేకుండా జట్టులో మార్పులు చేసుకోవచ్చు. మే 24 తర్వాతే టెక్నికల్ కమిటీ అనుమతితో జట్టులో మార్పులు చేయాలి. గాయపడిన ఆటగాళ్లకు మాత్రమే రిప్లేస్‌మెంట్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే పాకిస్థాన్ జట్టు ప్రకటనను పీసీబీ వాయిదా వేసింది. ఇంగ్లండ్‌తో తొలి టీ20 తరువాతే ప్రపంచకప్ జట్టును ప్రకటించనున్నారు’ అని పీసీబీకి అధికారి ఒకరు చెప్పాడు. పాకిస్తాన్ జట్టును మే 23 లేదా 24న ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.