NTV Telugu Site icon

David Warner : అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన డేవిడ్ భాయ్..

David Warner

David Warner

David Warner : ప్రస్తుతం జరుగుతున్న టి20 ప్రపంచ కప్ నుండి ఆస్ట్రేలియా టీం నిష్క్రమించిన తర్వాత ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు తెలిపారు. డు ఆర్ డై మ్యాచ్లో ఆస్ట్రేలియా టీమిండియాతో 24 పరుగుల ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో డేవిడ్ తన టీ20 కెరియర్ ను ముగించినట్లు అయింది. ఈ నిర్ణయాన్ని డేవిడ్ వార్నర్ ప్రపంచ కప్ జరగక ముందే రిటైర్మెంట్ ప్రకటించాడు. టి20 ప్రపంచ కప్ గెలిచి రిటైర్డ్ అవుదామన్న ఆయన కలలు కాస్త ఆశలు గానే మిగిలిపోయాయి.

Theme of Kalki 2898 AD: గూజ్ బంప్స్ తెప్పించేలా థీమ్ ఆఫ్ కల్కి 2898 AD

2024 జనవరి 1న డేవిడ్ వార్నర్ వన్డే క్రికెట్ వీడ్కోలు తెలపగా.. జనవరి 6న తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడి టెస్ట్ క్రికెట్ కూడా గుడ్ బాయ్ తెలిపారు. ఇప్పుడు తాజాగా టి20 వరల్డ్ కప్ నుంచి ఆస్ట్రేలియా వైతొలగడంతో అందులో కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక వార్నర్ పరుగుల హిస్టరీ చూస్తే.. టి20 లలో 110 మ్యాచులలో 3277 పరుగులను చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 28 అర్థ సెంచరీలు ఉన్నాయి. ఇక అలాగే వన్డే క్రికెట్లో 161 మ్యాచ్లులో 159 ఇన్నింగ్స్ లో ఆడిన వార్నర్ 6932 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు, 33 ఆర్డర్ సెంచరీలను సాధించాడు. అలాగే ఆస్ట్రేలియా టెస్ట్ టీం తరఫున 112 టెస్టులు ఆడిన డేవిడ్ వార్నర్.. మొత్తంగా 205 ఇన్నింగ్స్ లలో మూడు డబల్ సెంచరీలు, 26 సెంచరీలు, 37 అర్ధ సెంచరీలతో 8786 పరుగులను బాదాడు. దీంతో అన్ని ఫార్మేట్ లలో కలిపి 18 వేలకు పైగా పరుగులను చేశాడు. డేవిడ్ వార్నర్ 2 వరల్డ్ కప్, ఒక టి20 వరల్డ్ కప్, ఒక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ గెలిచిన జట్టులలో భాగస్వామ్యుడు.