Site icon NTV Telugu

Bangladesh Cricket: T20 వరల్డ్ కప్‌ను బహిష్కరించిన బంగ్లాదేశ్..

Ban

Ban

Bangladesh Boycott T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్‌కప్ 2026 కోసం తమ జట్టును భారత్‌కు పంపించబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అధికారికంగా ప్రకటించింది. ఇవాళ (జనవరి 22న) జరిగిన అంతర్గత సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీబీ వెల్లడించింది. కాగా, నిన్న (జనవరి 21న) అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) బీసీబీ డైరెక్టర్లతో సమావేశం నిర్వహించగా, టోర్నీలో పాల్గొనకపోతే స్కాట్లాండ్‌ను ప్రత్యామ్నాయ జట్టుగా ఎంపిక చేస్తామని ఐసీసీ తేల్చి చెప్పింది. ఈ టోర్నీ ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

Read Also: Harish Rao: “మాకు నోటీసులు ఇవ్వడానికి కారణం ఇదే”.. సిట్ నోటీసులపై హరీష్‌రావు ఫైర్

ఇక, ఈ అంశంపై స్పందించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం బుల్బుల్ మాట్లాడుతూ.. మేం వరల్డ్‌కప్ ఆడాలని కోరుకుంటున్నాం.. కానీ భారత్‌లో మాత్రం ఆడబోం.. ఈ విషయంపై ఐసీసీతో మా చర్చలు కొనసాగుతాయి.. ఐసీసీ బోర్డు సమావేశంలో కొన్ని షాకింగ్ నిర్ణయాలు తీసుకున్నారు.. ముస్తాఫిజుర్ అంశం ఒక్కటే కాదు.. ఆ విషయంలో భారతే పూర్తిగా నిర్ణయాధికారం చేపట్టింది అని అన్నారు. అలాగే, మా మ్యాచ్‌లను భారత్ బయట నిర్వహించాలన్న మా అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది.. ప్రపంచ క్రికెట్ పరిస్థితి ఏ దిశగా వెళ్తుందో అర్థం కావడం లేదని బంగ్లా క్రికెట్ బోర్డు అధ్యక్షుడు బుల్బుల్ పేర్కొన్నారు.

Read Also: Anil Ravipudi: 10వ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి..

అయితే, ప్రపంచవ్యాప్తంగా భారత్- ఐసీసీ నిర్ణయాలతో క్రికెట్ పై ప్రజాదరణ తగ్గుతోంది అని బంగ్లాదేశ్ తెలిపింది. సుమారు 200 మిలియన్ల మందిని ఆటకు దూరం చేస్తున్నారు.. క్రికెట్ ఒలింపిక్స్‌లోకి వస్తోంది.. కానీ మాలాంటి దేశం పాల్గొనలేక పోతే, అది ఐసీసీ వైఫల్యమే అని బుల్బుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ తప్పుకోవడంతో.. ఐసీసీ తదుపరి చర్యలు ఏంటీ అన్నది ఆసక్తిగా మారింది.

Exit mobile version