NTV Telugu Site icon

Sehwag-Shakib: సెహ్వాగ్‌ ఎవరో నాకు తెలియదు.. షకీబ్‌ అల్ హసన్ కౌంటర్‌!

Sehwag Shakib

Sehwag Shakib

Shakib Al Hasan React on Virender Sehwag’s Criticism: తనపై విమర్శలు చేసిన టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్ హసన్ గట్టి కౌంటర్‌ వేశాడు. ‘సెహ్వాగా?.. అతడెవరు?’ అంటూ జర్నలిస్టును ప్రశ్నించాడు. విమర్శకులు చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం ఆటగాళ్లకు లేదని సెహ్వాగ్‌ను ఉద్దేశించి అన్నాడు. సెహ్వాగ్‌ గురించి షకీబ్‌ మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియలో వైరల్‌ అవుతోంది. ఇంతకీ సెహ్వాగ్‌-షకీబ్‌ మధ్య ఏం జరిగిందంటే?..

టీ20 ప్రపంచ కప్‌ 2024 గ్రూప్‌ దశలో బంగ్లాదేశ్‌ ఆడిన తొలి రెండు మ్యాచ్‌లలో షకీబ్‌ అల్ హసన్ నిరాశపరిచాడు. శ్రీలంకపై 8, దక్షిణాఫ్రికాపై 3 రన్స్ చేసిన షకీబ్‌.. ఒక్క వికెట్‌ కూడా తీయలేదు. ముఖ్యంగా ప్రొటీస్ మ్యాచ్‌లో అవుటైన తీరు విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్‌ స్పందిస్తూ. అనవసర షాట్లకు అవుట్‌ కావడం ఏంటి, ఎప్పుడో రిటైర్‌ అవ్వాల్సిన క్రికెటర్‌ ఇంకా ఆడితే ఇలాగే ఉంటుందని విమర్శించాడు. షార్ట్ పిచ్ బాల్స్ ఆడడానికి నువ్వేమీ మాథ్యూ హెడ్‌న్‌, ఆడం గిల్‌క్రిస్ట్‌ కాదని.. ఓ బంగ్లాదేశ్‌ ప్లేయర్‌వి అని హేళన చేశాడు. నీ ప్రమాణాలు నువ్వు తెలుసుకొని.. నీకు తెలిసిన షాట్స్ ఆడాలని షకీబ్‌కు వీరూ సలహా ఇచ్చాడు.

Also Read: Xiaomi 14 Civi Price: భారత్‌లో ‘షావోమీ’ కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌.. ధర, ఫీచర్స్ ఇవే!

నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్ (64 నాటౌట్; 46 బంతుల్లో 9 ఫోర్లు) అర్ధ శతకం బాదాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 29 రన్స్ ఇచ్చి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. షకీబ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ మ్యాచ్ అవార్డు దక్కింది. అవార్డు అందుకున్నాక మీడియా సమావేశంలో షకీబ్‌ పాల్గొనగా.. వీరేంద్ర సెహ్వాగ్‌ వ్యాఖ్యల గురించి ఓ జర్నలిస్టు అడిగాడు. ‘సెహ్వాగా?.. అతడెవరు?’ అంటూ కౌంటర్ వేశాడు. ‘విమర్శకులు చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదు. జట్టుకు తాము ఏ విధంగా ఉపయోగపడగలం అని మాత్రమే ఆలోచించాలి. అలా ఆలోచించని వాళ్లే విమర్శలు చేస్తారు’ అని షకీబ్‌ అన్నాడు.