NTV Telugu Site icon

Afghanistan In Semis : అఫ్గానిస్తాన్ కెప్టెన్ కు విదేశాంగ మంత్రి ఫోన్‌.. వీడియో వైరల్..

Rasid Khan

Rasid Khan

Afghanistan In Semis : ప్రస్తుతం జరుగుతున్న టి20 ప్రపంచ కప్ 2024 లో ఎవరు ఊహించని విధంగా అఫ్గానిస్తాన్ జట్టు అంచనాలకు మించి టోర్నీలో హేమహేమీల జట్లని ఓడించి సెమీఫైనల్ కు చేరుకుంది. ఇప్పటివరకు ఆఫ్ఘనిస్తాన్ జరిగిన టి20 ప్రపంచ కప్ 2024లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి ప్రతిష్ట టీమ్స్ కు షాక్ ఇచ్చి సెమిస్ కు చేరుకుంది. నేడు జరిగిన బంగ్లాదేశ్ – ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ ఆధ్యంతం ఉత్కంఠ పోరు సాగగా.. చివరికి డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఆఫ్ఘనిస్తాన్ 8 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియా టీం ఇంటిదారి పట్టగా.. ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్ వైపు పయనించింది. ఇకపోతే ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆఫ్గనిస్తాన్ సెమీఫైనల్ కు చేరుకోలేదు. ఇదే మొదటిసారి కావడం విశేషం. సెమీఫైనల్ కి రావడంతో ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇక వారి దేశంలో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఇక మరోవైపు బంగ్లాదేశ్ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ గెలవగానే ఆఫ్ఘనిస్తాన్ టీం కెప్టెన్ రషీద్ ఖాన్ కు ఆ దేశ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ వీడియో కాల్ చేసి అభినందించారు.

BEL Requirements : బెల్ లో భారీగా ఉద్యోగాలు భర్తీ.. నెలకు జీతం రూ.90వేలు..

ఈ వీడియో కాల్ లో రషీద్ ఖాన్ ను మీరందరూ చాలా బాగా ఆడారని కొనియాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు నెట్టింట పోస్ట్ చేసింది. దింతో ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారిపోయింది. ఇక నేడు జరిగిన ఆఫ్ఘనిస్తాన్ – బంగ్లాదేశ్ మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 115 పరుగులు చేయగా.. లక్ష్య చేధనకు దిగిన బంగ్లాదేశ్ టీం ఇన్నింగ్స్ మధ్యలో వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచును 19 ఓవర్లకు కుదించారు. దాంతో బంగ్లా లక్ష్యాన్ని కేవలం రెండు పరుగులు మాత్రమే తగ్గించి 114 చేసారు. అయితే బంగ్లాదేశ్ కేవలం 17.5 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ మొట్టమొదటిసారి ప్రపంచ కప్ లో సెమి ఫైనల్ కు చేరుకుంది.