NTV Telugu Site icon

AFG vs SA : సఫారీల దెబ్బకు ఆఫ్ఘనిస్తాన్ విలవిల.. 56 అల్ అవుట్..

Afg Vs Sa

Afg Vs Sa

AFG vs SA : టి20 వరల్డ్ కప్ 2024 లో భాగంగా గురువారం నాడు జరిగిన మొదటి సెమి ఫైనల్లో సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ తరౌబ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో మొదట ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది. దాంతో ఆఫ్ఘనిస్తాన్ కేవలం 11.5 ఓవర్లలో 56 పరుగులకు కుప్ప కూలింది. సౌత్ ఆఫ్రికా బౌల్లర్స్ దెబ్బకి ఆఫ్ఘనిస్తాన్ ఏ పరిస్థితుల్లో కూడా తేలుకోలేకపోయింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్స్ లో ఒక్కరు మాత్రమే రెండు అంకెల స్కోరుని చేరుకున్నాడు. ఒమార్జై ఒక్కడే 10 పరుగులను చేసి అవుట్ అవ్వగా.. ఇన్నింగ్స్ లో ఎక్స్ట్రాలు 13 అత్యధిక స్కోర్ గా ఉంది. అంటే ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్స్ అంత కలిపి కేవలం 43 పరుగులు మాత్రమే చేసారు. ఈ ఇన్నింగ్స్ లో ముగ్గురు బ్యాట్స్మెన్స్ డక్ అవుట్ అయ్యారు.

Kalki 2898 AD X Review: ‘కల్కి 2898 ఏడీ’ బ్లాక్ బస్టర్ బొమ్మ.. ప్రభాస్ ఫాన్స్ కాలర్ ఎగరేయొచ్చు!

ఇక మరోవైపు సౌత్ ఆఫ్రికా బౌలర్లు విషయానికి వస్తే.. మార్కో జాన్సెన్, తబ్రైజ్ శంసిలు చెరో మూడు వికెట్లు.. కాగిసో రబడా, అన్రిచ్ నోర్ట్జే చెరో రెండు వికెట్లు తీసుకొని ఆఫ్ఘనిస్తాన్ పతనానికి కారణం అయ్యారు. సౌత్ ఆఫ్రికా కేవలం 57 పరుగులు చేస్తే ఫైనల్ కు చేరుకుంటుంది. నేడు రాత్రి 8 గంటలకు మరో సెమీఫైనల్ లో టీమిండియా, డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ లు తలబడునున్నాయి. ఫైనల్ మ్యాచ్ జూన్ 29న జరగనుంది.

America: అమెరికాలో మరో దారుణం.. భారత సంతతికి చెందిన వ్యక్తి మృతి