T20 World Cup Final 2022: ఆస్ట్రేలియా మెల్బోర్న్ వేదికగా జరగుతున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ తక్కువ సోరుకే పరిమితం అయింది. ఇంగ్లాండ్ బౌలింగ్ ధాటికి పాకిస్తాన్ బ్యాటర్లు తట్టుకోలేకపోయారు. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులకు మాత్రమే పరిమితం అయింది. ఇంగ్లాండ్ ముందు 138 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.
Read Also: AAP Leader Climbs Tower: టికెట్ ఇవ్వలేదని టవర్ ఎక్కిన ఆప్ నేత
సామ్ కర్రన్, ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్ లు పాకిస్తాన్ బ్యాటర్లకు కళ్లెం వేశారు. సామ్ కర్రన్ 3 వికెట్లు తీయగా.. రషీద్, జోర్డాన్లు ఇద్దరు తలో రెండు వికెట్లు తీశారు. బెన్ స్టోక్స్ ఒక వికెట్ తీశాడు. పాకిస్తాన్ బ్యాటర్లలో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. పది ఓవర్ల వరకు 80 రన్స్ చేసి కేవలం 2 వికేట్లు కోల్పోయిన పాకిస్తాన్ ఆ తరువాత వరస విరామాల్లో పాక్ వికెట్లను కోల్పోయింది. పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ 32(28) పరుగులు చేశాడు. మరో ఓపెనర్ స్టార్ బ్యాటర్ రిజ్వాన్ కేవలం 15(14) వెనుదిరిగాడు. షాన్ మసూద్ ఒక్కడే చెప్పుకోదగిన విధంగా పోరాడాడు. మసూద్ 38(28) పరుగులు చేశాడు. షాదాబ్ ఖాన్ 20(14) రన్స్ చేశాడు. మిగతా వారంతా కేవలం సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. చివరి నాలుగు వికెట్లను పాకిస్తాన్ కేవలం 10 పరుగుల్లోనే కోల్పోయింది.
