Site icon NTV Telugu

T20 World Cup 2026: వాషింగ్టన్ సుందర్ అవుట్.. ఐపీఎల్ స్టార్‌కు అవకాశం!

Washington Sundar

Washington Sundar

టీ20 వరల్డ్‌కప్‌ 2026 ముందు టీమిండియాకు భారీ పెద్ద ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ వరల్డ్‌కప్‌కు దూరమయ్యే ఛాన్సెస్ మెండుగా ఉన్నాయి. ఫిట్‌నెస్‌ కారణంగా అతడు మెగా టోర్నీకి అందుబాటులో ఉండడం లేదని తెలుస్తోంది. దీంతో భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుందర్ స్థానంలో యువ ఆటగాడు రియాన్ పరాగ్‌ను ఎంపిక చేయాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.

వాషింగ్టన్ సుందర్ గత కొన్నేళ్లుగా టీ20 ఫార్మాట్‌లో టీమిండియాకు కీలక ఆటగాడిగా ఉన్నాడు. పవర్‌ప్లేలో కట్టుదిట్టమైన స్పిన్ బౌలింగ్‌తో పాటు అవసరమైనప్పుడు వేగంగా పరుగులు సాధించే సామర్థ్యం అతడి సొంతం. ముఖ్యంగా విదేశీ పిచ్‌లపై కూడా మెరుగైన ప్రదర్శన చేశాడు. అలాంటి సుందర్ టీ20 వరల్డ్‌కప్‌కు దూరం కావడం భారత జట్టుకు నష్టం అనే చెప్పాలి. సుందర్ ఇప్పట్లో మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించే అవకాశం లేనట్లు తెలుస్తోంది. పూర్తిగా ఫిట్‌గా మారడానికి మరో రెండు వారాల సమయం పట్టొచ్చు. ఈ నేపథ్యంలో సుందర్ స్థానంలో రియాన్ పరాగ్‌ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి.

Also Read: IND vs NZ 4th T20: నేడు విశాఖలో నాలుగో టీ20.. సంజు శాంసన్‌ సంగతి ఏంటి?

ఐపీఎల్‌తో పాటు ఇటీవల దేశవాళీ టోర్నీల్లో రియాన్ పరాగ్ నిలకడైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్‌లో దూకుడుతో పాటు పార్ట్‌టైమ్ స్పిన్ బౌలింగ్‌తో కూడా జట్టుకు ఉపయోగపడనున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌ 2026 ముందర టీమిండియా యువ ఆటగాళ్లపై బీసీసీఐ ఎక్కువగా దృష్టి సారిస్తోంది. రియాన్ పరాగ్‌కు ఇది కెరీర్‌లో అతిపెద్ద అవకాశం అనే చెప్పాలి. ఒకవేళ అతడు జట్టులో చోటు దక్కించుకుంటే.. మిడిలార్డర్‌లో భారత జట్టుకు అదనపు బలం చేకూరే అవకాశముంది.

Exit mobile version