ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో టీమిండియా కూర్పుపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని కీలక ఆటగాళ్ల ఫిట్‌నెస్, ఫామ్‌పై సందేహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో మిడిల్ ఆర్డర్‌లో కీలకంగా మారిన తిలక్ వర్మ టోర్నీకి దూరమైతే భారత జట్టు పరిస్థితి ఏంటి, ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందనే అంశంపై క్రికెట్ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.
తిలక్ వర్మ లేకపోతే బ్యాటింగ్ ఆర్డర్‌లో స్థిరత్వం కొరవడుతుంది. ఈ పరిస్థితుల్లో టీమిండియాకు బలమైన, సమతుల్యమైన ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేయాల్సిన అవసరం ఉంది. టాప్ ఆర్డర్‌లో దూకుడు, మిడిల్ ఆర్డర్‌లో అనుభవం, ఆల్‌రౌండర్లతో లోతైన బ్యాటింగ్, పదునైన బౌలింగ్ యూనిట్ ఉంటేనే ప్రపంచకప్‌లో విజయం సాధించే అవకాశం ఉంటుంది. అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఓపెనర్లుగా బరిలోకి దిగితే.. పవర్‌ప్లేలో వేగంగా పరుగులు రాబట్టే అవకాశం ఉంటుంది. అభిషేక్ దూకుడు బ్యాటింగ్‌తో ప్రత్యర్థులపై ఒత్తిడి పెడతాడు. మరోవైపు సంజు వికెట్‌కీపర్‌గా కూడా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తాడు.
Also Read: Pawan Kalyan: డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదు.. ఆఖరి శ్వాస వరకు..!
మూడో స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఉంటే ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లగలడు. నాలుగో స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ టీమిండియాకు అతిపెద్ద బలం. ఐదో స్థానంలో శివమ్ దూబే భారీ షాట్లతో మ్యాచ్ దిశ మార్చగలడు. ఆరవ స్థానంలో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌లో లోతు పెరగడమే కాకుండా కీలక ఓవర్లు బౌలింగ్ చేయగలడు. ఏడో స్థానంలో అక్షర్ పటేల్ ఆట టీమ్‌కు మంచి బ్యాలెన్స్‌ను అందిస్తుంది. ఎనిమిదో స్థానంలో పరిస్థితులను బట్టి వాషింగ్టన్ సుందర్ లేదా కుల్దీప్ యాదవ్ ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. పేస్ విభాగంలో అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాలు కొత్త బంతిని పంచుకోనున్నారు. స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు సవాల్ విసురుతాడు. ఈ జట్టుతో టీమిండియా టీ20 ప్రపంచకప్‌లో బలమైన జట్టుగా నిలిచే అవకాశముంది.
