ICC Pre-Seeding Rule: అగ్రస్థానంలో నిలిచిన టీమ్స్ అన్నీ గ్రూప్-1లోనే.. ఎందుకో తెలుసా?
- సూపర్-8 దశకు రంగం సిద్ధం
- తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్, న్యూజిలాండ్ ఢీ
- జట్ల గ్రూపింగ్‌లో వినూత్న పరిణామం
- అగ్రస్థానంలో నిలిచిన టీమ్స్ అన్నీ గ్రూప్-1లోనే ఎందుకు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Do You Know Why All Group Toppers Are in Super 8 Group 1: టీ20 ప్రపంచకప్ 2026లో అత్యంత కీలకమైన సూపర్-8 దశకు రంగం సిద్ధమైంది. నేటి నుంచే సూపర్-8 పోరు ఆరంభం కానుంది. సూపర్-8కు చేరిన 8 జట్లు.. సెమీస్ బెర్తుల కోసం హోరాహోరీగా తలపడనున్నాయి. సూపర్-8 తొలి మ్యాచ్‌లో టాప్ టీమ్స్ పాకిస్థాన్, న్యూజిలాండ్ కొలంబోలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. 8 జట్లు మంచి ఫామ్ మీదుండడంతో మ్యాచులు హోరాహోరీగా సాగడం పక్కా. అయితే ఈసారి జట్ల గ్రూపింగ్‌లో ఒక వినూత్న పరిణామం చోటు చేసుకుంది.
టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన జట్లన్నీ సూపర్-8 పోరు కోసం ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. రెండో స్థానంలో నిలిచిన జట్లు మరో గ్రూప్‌లో చోటు దక్కించుకున్నాయి. టోర్నీ ప్రారంభానికి ముందే నిర్ణయించిన సీడింగ్ విధానం వల్ల ఈ ఆసక్తికర సమీకరణం ఏర్పడింది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా టాప్-8 జట్లకు ముందే సీడింగ్ కేటాయించారు. ఈ సీడింగ్ ప్రకారం జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- Ind Vs Afg: ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి టీ20 మ్యాచ్.. అద్భుత పోరాటం చేసిన ఒమర్జాయ్..
- Dinesh Karthik: టెస్టు క్రికెట్‌ను పాకిస్థాన్ మర్చిపోవడం మంచిది.. ఘోరమైన స్థితిలో పాక్ జట్టు..
Also Read: Sree Vishnu Movies: టెన్షన్ మధ్య నిద్రపోని హీరో శ్రీ విష్ణు.. ఎట్టకేలకు లైన్ క్లియర్!
గ్రూప్-1 (బేసి సంఖ్య సీడింగ్స్)లో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 1, 3, 5, 7 స్థానాల్లో ఉన్న భారత్ (X1), ఆస్ట్రేలియా (X2), దక్షిణాఫ్రికా (X3), వెస్టిండీస్ (X4) జట్లను ఈ గ్రూప్‌లో చేర్చారు. గ్రూప్-2 (సరి సంఖ్య సీడింగ్స్)లో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 2, 4, 6, 8 స్థానాల్లో ఉన్న ఇంగ్లాండ్ (Y1), న్యూజిలాండ్ (Y2), పాకిస్థాన్ (Y3), శ్రీలంక (Y4) జట్లకు ఈ గ్రూప్‌లో చోటు కల్పించారు. టాప్-8 సీడింగ్‌లో ఉన్న ఏదైనా జట్టు సూపర్-8కు అర్హత సాధించకపోతే.. ఆ స్థానాన్ని (సీడింగ్‌ను) గ్రూప్ దశలో ముందంజ వేసిన ఇతర జట్టుకు కేటాయిస్తారు. ఈ నిబంధన ప్రకారమే.. ఆస్ట్రేలియాకు కేటాయించిన X2 సీడింగ్‌ను జింబాబ్వే సొంతం చేసుకుంది. తద్వారా జింబాబ్వే గ్రూప్-1లో తన స్థానాన్ని ఖాయం చేసుకుని బలమైన జట్లతో తలపడేందుకు సిద్ధమైంది.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!