Site icon NTV Telugu

T20 World Cup 2026 Schedule: నేడే టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌.. భారత్‌లోని 5 వేదికల్లో మ్యాచ్‌లు!

T20 World Cup 2026 Schedule

T20 World Cup 2026 Schedule

భారత్‌, శ్రీలంక వేదికగా పురుషుల టీ20 ప్రపంచకప్‌ 2026 జరగనున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనున్న మెగా టోర్నమెంట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ ఈ రోజు విడుదల కానుంది. సాయంత్రం 6:30కు ఐసీసీ షెడ్యూల్‌ను రిలీజ్ చేయనుంది. షెడ్యూల్‌పై అందరూ ఆసక్తిగా ఉన్నారు. దాయాది దేశాలు భారత్‌, పాకిస్థాన్‌ షెడ్యూల్‌ ఎలా ఉండనుందో నేడు తేలనుంది. స్టార్ స్పోర్ట్స్ 1, 2, 3 ఛానెళ్లలో లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు. జియో హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో కూడా లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.

టీ20 ప్రపంచకప్‌ 2026 మ్యాచ్‌లు భారత్‌లోని 5 వేదికలు అహ్మదాబాద్‌, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలో.. శ్రీలంకలోని మూడు వేదికల్లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఫైనల్‌ మ్యాచ్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఉండనుంది. ఒకవేళ పాకిస్థాన్‌ ఫైనల్‌కు చేరితే.. శ్రీలంకలోని కొలంబోలో తుది పోరు ఉంటుంది. సెమీ ఫైనల్స్‌లో ఒక మ్యాచ్‌ ముంబైలోని వాంఖడేలో జరగనున్నట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్‌ 2024ను భారత్ గెలుచుకున్న విషయం తెలిసిందే. మెగా టోర్నీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా భారత్ బరిలోకి దిగనుంది.

Also Read: Palak Muchhal: మంధాన, పలాశ్‌ వివాహం ఆగింది.. మా గోప్యతను కాపాడండి!

నివేదికల ప్రకారం భారత్ గ్రూప్ Aలో ఉండనుంది. ఈ గ్రూపులో పాకిస్థాన్, నెదర్లాండ్స్, నమీబియా, యూఎస్ఏలు ఉండే అవకాశాలు ఉన్నాయి. టీ20 ప్రపంచకప్‌ 2026లో మొత్తంగా 20 జట్లు ఆడనున్నాయి. భారత్‌, శ్రీలంక, ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఇంగ్లాండ్‌, యూఏఈ, ఒమన్‌, వెస్టిండీస్‌, యూఎస్‌ఏ, కెనడా, నమీబియా, జింబాబ్వే, ఐర్లాండ్‌, నెదర్లాండ్స్‌, ఇటలీ, నేపాల్‌ తలపడనున్నాయి.

Exit mobile version