T20 World Cup 2026: ఈసారి టీ20 వరల్డ్ కప్ మాదే.. పాకిస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • 2021 తర్వాత మేము ఐసీసీ ట్రోఫీలు గెలవలేకపోయాం
  • మేము మంచి క్రికెట్ ఆడలేదు
  • పాకిస్తాన్ అభిమానులను మేము నిరాశపర్చాం
Salman Ali Agha

Salman Ali Agha

పాకిస్తాన్ క్రికెట్ అభిమానులను ఉత్సాహపరిచే విధంగా సీనియర్ క్రికెటర్ సల్మాన్ అలీ ఆఘా కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో పాక్ జట్టు ఎదుర్కొన్న సవాళ్లు, ఫలితాలపై స్పందించారు. పాకిస్తాన్ కొన్ని ప్రధాన ట్రోఫీలు గెలవలేకపోయినప్పటికీ.. ఈ సారి కొత్త ఉత్సాహంతో ఆడేందుకు జట్టు సిద్ధంగా ఉందన్నాడు. ఈ సారి టీ20 వరల్డ్ కప్ గెలిచి పాకిస్తాన్ అభిమానులను సంతోషపెట్టాలని చూస్తున్నాం అని పాకిస్థాన్ కెప్టెన్ చెప్పాడు. సల్మాన్ అలీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Also Read: Vivo X200T Review: మూడు 50MP కెమెరాస్, 6200mAh బ్యాటరీ.. ‘వివో ఎక్స్‌200టీ’ రివ్యూ!

సల్మాన్ అలీ ఆఘా మాట్లాడుతూ… ‘2021 తర్వాత మేము ఐసీసీ ట్రోఫీలు గెలవలేకపోయాం. ఆసియా కప్, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కూడా గెలవలేదు. మేము మంచి క్రికెట్ ఆడలేదు. పాకిస్తాన్ అభిమానులను మేము నిరాశపర్చాం. కానీ ఈసారి మేము పూర్తిగా సిద్దమయ్యాం. మేము ఇప్పుడు బ్రాండ్‌ క్రికెట్ ఆడుతున్నాము. టీ20 ప్రపంచకప్ గెలిచి పాకిస్తాన్ అభిమానులను సంతోషపెడతాం’ అని చెప్పాడు. జట్టు గత వైఫల్యాలను మర్చిపోని, ప్రస్తుత ప్రదర్శనతో అభిమానులను గర్వపడేలా చేస్తామని సల్మాన్ అలీ చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలు పాకిస్తానీ క్రికెట్ ప్రపంచంలో చర్చకు దారి తీసాయి. టోర్నీ ప్రారంభానికి ముందు ఈ ప్రకటనతో అభిమానుల్లో జట్టుపై నమ్మకం మరింత పెరిగింది.