టీ20 ప్రపంచకప్ 2026లో వెస్టిండీస్ బోణీ కొట్టింది. కోల్‌కతాలో స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. 183 పరుగుల లక్ష్య ఛేదనలో 18.5 ఓవర్లలో స్కాట్లాండ్ 147 పరుగులకు ఆలౌట్ అయింది. బెర్రింగ్‌టన్ (42; 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులు), టామ్ బ్రూస్ (35; 28 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులు) ఫర్వాలేదనిపించారు. స్కాట్లాండ్ మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. వెస్టిండీస్ బౌలర్లలో రోమారియో షెపర్డ్ హ్యాట్రిక్ సహా 5 వికెట్లు పడగొట్టాడు. జాసన్ హోల్డర్ 2 వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో విండీస్ ఖాతాలో రెండు పాయింట్స్ చేరాయి.
Also Read: IND vs USA: టీమిండియాదే బ్యాటింగ్.. ముగ్గురు స్టార్స్ అవుట్, డీఎస్పీ ఇన్!
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. షిమ్రాన్ హెట్‌మయెర్ హాఫ్ సెంచరీ బాదాడు. 36 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సులతో 64 రన్స్ చేశాడు. ఓపెనర్ బ్రాండన్ కింగ్ (35), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (26), రోవ్‌మన్ పావెల్ (24), షై హోప్ (19) పరుగులు చేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో బ్రాడ్ 2 వికెట్లు తీశారు. షరీఫ్, డేవిడ్సన్, లీస్క్ తలో వికెట్ పడగొట్టారు. విండీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన హెట్‌మయెర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
