Site icon NTV Telugu

T20 World Cup 2026: అయ్యో అయ్యయ్యో సంజు శాంసన్‌.. ఇక అంతే సంగతులు, ఇషాన్‌కు ప్లేస్ ఫిక్స్!

Ishan Kishan Opener

Ishan Kishan Opener

టీ20 వరల్డ్‌కప్ 2026 కోసం బీసీసీఐ ఇప్పటికే భారత జట్టును ప్రకటించింది. జట్టులో మార్పులు చేసుకునేందుకు జనవరి 31 వరకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత సెలెక్టర్ల ముందు ఓ కీలక ప్రశ్న నిలిచింది. అదే.. అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించేది ఎవరు?. సంజు శాంసన్‌?, ఇషాన్ కిషన్?, శుభ్‌మన్ గిల్?.. ఈ ముగ్గురిలో ఓపెనర్‌గా ఎవరు ఆడుతారు?. ప్రస్తుత ఫామ్ చూస్తే.. ఓపెనర్‌గా ఇషాన్ ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. గిల్ ఇప్పుడు జట్టులో లేకున్నా.. సంజు వరుస వైఫల్యాలు అతడికి చోటు దక్కేలా చేస్తాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 3-0తో కైవసం చేసుకున్నా.. ఆ మూడు విజయాల్లో సంజు శాంసన్‌ పాత్ర ఏమీ లేదు. మూడు టీ20ల్లో వరుసగా 10, 6, 0 పరుగులతో నిరాశ పరిచాడు. గువాహటిలో తొలి బంతికే ఆఫ్‌స్టంప్ ఎగిరిపోయింది. బ్యాక్ ఫుట్ నుంచి ఫ్లిక్ చేయబోయి పూర్తిగా మిస్ అయ్యాడు. గాయపడిన తెలుగు ఆటగాడు తిలక్ వర్మ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ రెచ్చిపోయాడు. వరుసగా 8, 76, 28 పరుగులతో సత్తాచాటాడు. దాంతో టీ20 వరల్డ్‌కప్ 2026 ముందు సంజు ఫామ్ బీసీసీఐ సెలెక్షన్ చర్చల్లో ప్రధాన అంశంగా మారింది.

Also Read: Abhishek Sharma: అదేం బ్యాటింగ్‌రా సామీ.. 10 బంతుల్లోనే 50 రన్స్ చేస్తాడు!

తిలక్ వర్మ ఫిట్‌నెస్‌ సాధించాడు కాబట్టి మూడో స్థానంలో ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో ఫామ్ లేమితో సతమతం అవుతున్న సంజు శాంసన్‌ను ప్లేయింగ్ 11లో ఉంచడం కష్టమే. అప్పుడు ఇషాన్ కిషన్ జట్టులో ఉండడం ఖాయం. అభిషేక్ శర్మతో కలిసి ఇషాన్ ఓపెనింగ్ చేస్తాడు. ఇషాన్ వికెట్ కీపర్ కూడా కావడం అతడికి కలిసొచ్చే అంశం. సూర్యకుమార్ యాదవ్ తిరిగి ఫామ్‌కు వచ్చాడు. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా నాలుగో స్థానంలో ఆడుతాడు. ఆపై హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, శివమ్ దూబేలు ఆడుతారు. ఫామ్ పరంగా చూసుకుంటే.. శుభ్‌మన్ గిల్ జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమే. సంజు జట్టులో ఉన్నా.. ఇషాన్ ఓపెనింగ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఎటు చూసుకున్నా.. న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌ సంజుకు నిరాశ కలిగించింది. అంతేకాదు ఇక సంజు పని అయిపోయినట్లే అని కూడా ఫాన్స్ అంటున్నారు. చూడాలి మరి సంజు పరిస్థితి ఎలా ఉండనుందో.

Exit mobile version