ఇండియా శ్రీలంక జట్ల మధ్య మూడో టీ 20 మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కాబోతున్నది. టాస్ గెలిచిన ఇండియా జట్టు బ్యాటింగ్‌ను ఎంచుకుంది. ఇప్పటికే రెండు టీ 20 మ్యాచ్‌లు ముగిశాయి. మొదటి మ్యాచ్‌లో ఇండియా గెలిస్తే, రెండో మ్యాచ్‌లో లంక విజయం సాధించింది. దీంతో సీరిస్ 1-1గా సమం అయింది. ఈరోజు ఏ జట్టు విజయం సాధిస్తే ఆ జట్టు టీ 20 విజేతగా నిలుస్తుంది. ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు రెండు జట్లు ఉదయం నుంచి తీవ్రంగా ప్రాక్టీస్ చేశాయి. మరి ఈ ఫైనల్ టీ 20 మ్యాచ్ విజేత ఎవరనేది మరికాసేపట్లోనే తేలిపోతుంది.
Read: రేపు థియేటర్లలో రెండు రీమేక్ చిత్రాల ఢీ!