Suryakumar Yadav: టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో వేగంగా 100 సిక్సర్లు కొట్టిన తొలి భారత ఆటగాడిగా సూర్యకుమార్ నిలిచాడు. ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు సిక్సర్లు కొట్టి అతడు ఈ ఫీట్ సాధించాడు. సూర్యకుమార్ కేవలం 61 ఇన్నింగ్సులలోనే 100 సిక్సర్ల ఘనతను సాధించాడు. గతంలో హార్దిక్ పాండ్యా 101 అంతర్జాతీయ ఇన్నింగ్సులలో 100 సిక్సర్లు కొట్టి భారత్ తరఫున టాప్‌లో నిలిచాడు. తాజాగా హార్దిక్ పాండ్యాను వెనక్కి నెట్టి సూర్యకుమార్ అతడి స్థానాన్ని ఆక్రమించాడు.
Read Also: Coffee Day: కేఫ్ కాఫీ డేకు 26 కోట్ల జరిమానా..అదే కారణం
కాగా సైంటిస్టు కావాలన్న తల్లిదండ్రుల కోరికకు భిన్నంగా సూర్యకుమార్ యాదవ్ క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. కాంక్రీట్ పిచ్‌మీద టెన్నిస్ బంతులతో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. విభిన్న షాట్లు సంధించడంలో చిన్నప్పుడే నైపుణ్యం సంపాదించాడు. పోటీ ఎక్కువగా ఉండే ముంబై క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు పొందేలా తన ఆటకు మెరుగులు దిద్దుకున్నాడు. చిన్నతనంలోనే విభిన్న షాట్లపై ప్రాక్టీస్ చేయడం సూర్యకు కలిసొచ్చింది. అందుకే ఇప్పుడు టీమిండియాలో మిస్టర్ 360గా అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. కాగా 20 ఏళ్ల వయసులోనే ముంబై రంజీ జట్టుకు ఆడిన సూర్య 2011-12 సీజన్‌లో 754 పరుగులు సాధించి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవడం విశేషం.