Site icon NTV Telugu

Suryakumar Yadav-Mr 360: సూర్యా భాయ్.. ‘మిస్టర్ 360’ అని మరోసారి నిరూపించావ్!

Suryakumar Yadav Mr 360

Suryakumar Yadav Mr 360

Suryakumar Yadav proving why he is called Mr 360: టీ20 ప్రపంచకప్‌ 2026లో ముంబై వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో భారత కెప్టెన్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ మరోసారి తన క్లాస్‌ను చూపించాడు. సహచర ప్లేయర్స్ వరుసగా పెవిలియన్ చేరుతున్నా.. సూరీడు కీలక సమయంలో బ్యాట్ జులిపించాడు. ముఖ్యంగా చివరి ఓవర్లలలో ఊచకోత కోసి భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఒత్తిడిలోనూ తన స్టైల్ మార్చకుండా.. ఆడిన సూర్య ఇన్నింగ్స్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఒకవేళ అందరి బ్యాటర్ల మాదిరే సూర్య కూడా త్వరగా పెవిలియన్ చేరుంటే.. భారత్ 100 పరుగుల లోపే ఆలౌట్ అయ్యేది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం సృష్టించాడు. ఆ ఓవర్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్సులు బాది అమెరికా బౌలర్లకు చుక్కలు చూపించాడు. అంతకుముందు 19వ ఓవర్‌లో కూడా ఓ ఫోర్, ఓ సిక్స్ బాది స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు. సూర్య మైదానం నలు మూలలా షాట్స్ ఆడాడు. గ్యాప్ చూసి మరీ సిక్సులు, ఫోర్లు బాది కీలక పరుగులు చేశాడు. ఆ సమయంలో సూర్య బ్యాటింగ్ చూస్తే.. నిజంగానే ‘మిస్టర్ 360’ అనే బిరుదు ఎందుకు వచ్చిందో అర్థమైంది.

Also Read: Vivo V70 Elite Look: ప్యాషన్ రెడ్‌లో అదిరిపోయే లుక్.. అందరి చూపులన్నీ ‘వివో వీ70 ఎలైట్’పైనే!

సూర్యకుమార్ యాదవ్ చివరి వరకు క్రీజులో నిలిచి 84 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 360 డిగ్రీల షాట్స్‌తో ఫీల్డింగ్ పరిమితులను చెరిపేసిన సూర్య.. ప్రేక్షకులను ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేశాడు. మిగతా బ్యాటర్లు త్వరగా పెవిలియన్ చేరినా.. ‘ఒకే ఒక్కడి’గా పోరాడిన సూర్య భారత ఇన్నింగ్స్‌కు ప్రాణం పోశాడు. ప్రస్తుతం సూర్యపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. సూర్యా భాయ్ సూపర్, సూర్యకుమార్ అద్భుత ఇన్నింగ్స్, సూర్యకుమార్ కెప్టెన్ ఇన్నింగ్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో భారత్‌ 9 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ విఫలమైన వేళ.. చివరి ఓవర్లలో సూర్య ఆడిన ఈ ఇన్నింగ్స్ భారత్‌కు కీలకంగా మారింది. ఒత్తిడిలోనూ బాధ్యత తీసుకుని ఆడగలడని మరోసారి రుజువు చేసిన సూర్యకుమార్.. నిజంగానే టీమిండియాకు అమూల్యమైన ‘మిస్టర్ 360’గా నిలిచాడు.

Exit mobile version