టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా నివాసంలో విషాదం నెలకొంది. రైనా తండ్రి త్రిలోక్‌చంద్ రైనా ఆదివారం ఘాజియాబాద్‌లోని స్వగృహంలో మరణించారు. కొన్నిరోజులుగా ఆయన క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. త్రిలోక్ చంద్ గతంలో మిలటరీ అధికారిగా పనిచేశారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో బాంబులు తయారు చేయడంలో ఆయన దిట్ట. ఆయన పూర్వీకులది జమ్ముకాశ్మీర్‌లోని రైనావరి గ్రామం. 1990లలో కశ్మీరీ పండిట్ల హత్యల ఘటన అనంతరం ఆ గ్రామాన్ని విడిచిపెట్టారు. అనంతరం యూపీలోని మురాద్‌నగర్‌లో స్థిరపడ్డారు.
Read Also: లతా మంగేష్కర్‌కు టీమిండియా నివాళి
కాగా తక్కువ జీతమే వస్తున్నా కొడుకును క్రికెటర్ చేసేందుకు త్రిలోక్ చంద్ ఎంతో కష్టపడ్డారు. యూపీలోని మురాదాబాద్ పట్టణంలో రూ.10వేల జీతానికి పనిచేసేవారు. రైనా క్రికెట్ కోచింగ్‌కు సైతం డబ్బులు ఉండేవి కావు. 1998లో లక్నోలోని గురు గోవింద్ సింగ్ క్రీడా కళాశాలలో రైనా చేరాడు. అక్కడ తనెంతో జాగ్రత్తగా ఉండేవాడినని రైనా గతంలో చెప్పాడు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగుండటంతో కశ్మీర్‌లో క్రికెట్, క్రీడల అభివృద్ధికి సురేశ్ రైనా సాయం చేస్తున్నాడు.
