Site icon NTV Telugu

Suresh Raina: పాకిస్థాన్‌పై గెలిస్తే టీ20 ప్రపంచకప్ మనదే..!!

Suresh Raina

Suresh Raina

Suresh Raina: టీ20 ప్రపంచకప్‌లో ఆరంభ మ్యాచ్‌లు కాక రేపుతున్నాయి. శ్రీలంకపై నమీబియా, వెస్టిండీస్‌పై స్కాట్లాండ్ గెలిచి ఆయా జట్లకు షాకిచ్చాయి. ఇప్పుడు టోర్నీలో ముందడుగు వేయాలంటే శ్రీలంక, వెస్టిండీస్ గొప్పగా పోరాడాల్సి ఉంది. మరోవైపు ప్రాక్టీస్ మ్యాచ్‌లో అన్ని రంగాల్లో అదరగొట్టిన టీమిండియా అసలు టోర్నీలో ఎలా ఆడుతుందన్న విషయం ఆసక్తికరంగా మారింది. తొలి మ్యాచ్‌లో భాగంగా ఈనెల 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమిండియా ఆడాలి. ఈ నేపథ్యంలో మాజీ ఆల్‌రౌండర్ సురేష్ రైనా స్పందించాడు. పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌ను గెలిస్తే భారత్ తప్పనిసరిగా ఫైనల్స్ చేరుకుంటుందని, రోహిత్ సేన ఛాంపియన్‌గా ఆవిర్భవిస్తుందని సురేష్ రైనా జోస్యం చెప్పాడు.

Read Also: Jio Nokia: జియో-నోకియా మధ్య కీలక ఒప్పందం.. మార్కెట్ మామూలుగా ఉండదు

అటు ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ లైనప్‌లు పకడ్బందీగా ఉన్నాయని సురేష్ రైనా చెప్పాడు. బుమ్రా స్థానాన్ని మహ్మద్ షమీ విజయవంతంగా రీప్లేస్ చేశాడని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాపై వార్మప్ మ్యాచ్‌లో తీవ్ర ఒత్తడి మధ్య అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడని ప్రశంసలు కురిపించాడు. అటు బ్యాటింగ్‌లో టాపార్డర్‌కు సూర్యకుమార్ యాదవ్ వెన్నెముకలా మారాడని.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అతను రాణించగలడని రైనా అభిప్రాయపడ్డాడు. కోహ్లీ కూడా ఫామ్ అందుకున్నాడని.. రోహిత్ శర్మ సమర్థవంతమైన కెప్టెన్ అని రైనా చెప్పాడు.

Exit mobile version