South Africa T20 League: ఇండియాలోని ఐపీఎల్ తరహాలో దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌ను భారీగా నిర్వహించబోతున్నారు. ఈ మేరకు ఆరు జట్లు ఆటగాళ్ల కోసం సోమవారం జరిగిన వేలంలో హోరాహోరీగా తలపడ్డాయి. సౌతాఫ్రికా 20 లీగ్‌లోని మొత్తం ఆరు జట్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీల యాజమాన్యం చేతిలోనే ఉన్నాయి. ఎంఐ కేప్ టౌన్ జట్టును ముంబై ఇండియన్స్ యాజమాన్యం, ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టును ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం , పార్ల్ రాయల్స్ జట్టును రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం, డర్బన్ సూపర్ జెయింట్స్ జట్టును సంజయ్ గోయెంకాకు చెందిన లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం, జోహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ జట్టును ఇండియా సిమెంట్స్ సంస్థకు చెందిన చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టును సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ కొనుగోలు చేశారు.
అయితే సోమవారం జరిగిన ఆటగాళ్ల వేలంలో దక్షిణాఫ్రికాకు చెందిన సంచలన యువ బ్యాట్స్‌మెన్ ట్రిస్టన్ స్టబ్స్ అత్యధిక ధర పలికాడు. ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు స్టబ్స్‌ను కొనుగోలు చేయడం విశేషం. రూ.4.13 కోట్ల భారీ ధరకు అతన్ని సన్ రైజర్స్ సొంతం చేసుకుంది. స్టబ్స్ తర్వాత రోసౌ, మార్కో జాన్సన్ అత్యధిక ధర పలికారు. రోసౌను రూ.3.10 కోట్లకు ప్రిటోరియా క్యాపిటల్స్ కొనుగోలు చేయగా.. జాన్సన్‌ను కూడా సన్‌రైజర్స్ జట్టే రూ.2.74 కోట్లకు కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికా టెస్ట్ జట్టు కెప్టెన్ డీన్ ఎల్గార్, వన్డే, టీ20ల కెప్టెన్ టెంబా బవుమా, స్టార్ బౌలర్ ఫెలుక్వాయో వేలంలో అమ్ముడుపోలేదు. అయితే ఐపీఎల్‌లో జట్టు ఎంపికలో చేసిన పొరపాట్లనే కావ్యా మారన్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. టీమ్‌లో బ్యాట్స్‌మెన్, ఆల్‌రౌండర్లు కాకుండా ఎక్కువగా బౌలర్లే కనిపిస్తున్నారని నెటిజన్‌లు కామెంట్ చేస్తున్నారు. అయితే వాళ్ల కోసం కోట్లు కుమ్మరించడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు వివరాలు: ఐడెన్ మార్‌క్రమ్, ఒట్నీల్ బార్ట్‌మాన్, మార్కో జాన్సెన్, ట్రిస్టన్ స్టబ్స్, సిసాండా మగాలా, జునైద్ దావూద్, మాసన్ క్రేన్, జోన్-జోన్ స్మట్స్, జోర్డాన్ కాక్స్, ఆడమ్ రోసింగ్‌టన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, మార్క్వెస్ అకెర్‌మాన్, జేమ్స్ ఫుల్లర్, సరెల్యా కార్వీ, ఎర్యడన్ కార్వీ గ్కమనే, టామ్ అబెల్
Good Morning #OrangeArmy 🌞
Our family officially got bigger last night 🧡#SA20Auction #OrangeArmy #SEC #SunrisersEasternCape pic.twitter.com/dgkxsyBjJ8
— Sunrisers Eastern Cape (@SunrisersEC) September 20, 2022
