Site icon NTV Telugu

Sunrisers Hyderabad: కేన్ మామ గాయం వార్తలు ఫేక్.. ఇదిగో వీడియో..!!

మరో వారం రోజుల్లో ఐపీఎల్-15 సీజన్ ప్రారంభం కానుంది. దీంతో ఇప్పటి నుంచే అన్ని జట్లు మైదానంలోకి అడుగుపెట్టి ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మోచేతి గాయంతో ఇంకా బాధపడుతున్నాడని.. అతడు ప్రారంభ మ్యాచ్‌లకు దూరంగా ఉంటాడని ప్రచారం జరుగుతోంది. గత ఏడాదితో భారత్‌తో టెస్ట్ సిరీస్ అనంతరం కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. దీంతో అతడు ఫిట్‌గా లేడని కూడా వార్తలు వస్తున్నాయి.

అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ తాజాగా విడుదల చేసిన ఓ వీడియోతో కేన్ మామపై వస్తున్న వార్తలు ఫేక్ అని తేలిపోయింది. తాజాగా విడుదల చేసిన వీడియోలో ప్రాక్టీస్ సెషన్‌లో కేన్ మామ జాలిగా ఆడుతూ కనిపించాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నాడు. మరోవైపు అభిమానులు కేన్ విలియమ్సన్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. చుట్టూ చీకటి ఉన్నా వెలిగే కిరణం అతడే అంటూ కేన్ మామపైనే సన్‌రైజర్స్ అభిమానులు భరోసాతో ఉన్నారు.

Exit mobile version