NTV Telugu Site icon

Ashes 2023: సూపర్ ఫీల్డ్ సెట్ చేసిన బెన్ స్టోక్స్.. తడిసిపోయిన స్టీవ్ స్మిత్‌ ప్యాంట్!

Untitled Design (2)

Untitled Design (2)

Steven Smith tensed after Ben Stokes set a fielding in Ashes 2023: యాషెస్ సిరీస్‌ 2023లో భాగంగా బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. తొలిరోజు ఇంగ్లండ్ ఆధిపత్యం చెలాయిస్తే.. రెండో రోజు ఆస్ట్రేలియా దీటుగా బదులిస్తోంది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (126 బ్యాటింగ్‌; 279 బంతుల్లో 14×4, 2×6) సెంచరీతో ఆసీస్ కోలుకుంది. రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి 311/5తో మెరుగైన స్థితికి చేరుకుంది. ఖవాజాకు అండగా మాజీ కెప్టెన్ అలెక్స్‌ కేరీ (52 బ్యాటింగ్‌; 80 బంతుల్లో 7×4, 1×6) క్రీజులో ఉన్నాడు. ట్రావిస్ హెడ్‌ (50; 63 బంతుల్లో 8×4, 1×6) హాఫ్ సెంచరీతో రాణించాడు.

అయితే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సందర్భంగా ఓ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 4/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆట కొనసాగించిన ఆసీస్‌కు ఇంగ్లీష్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ భారీ షాక్ ఇచ్చాడు. వరుస బంతుల్లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (9), మార్నస్ లబుషేన్‌లను ఔట్ చేశాడు. సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ క్రీజులోకి రాగానే బెన్ స్టోక్స్ ఆసక్తికర ఫీల్డ్ సెటప్ చేశాడు. హ్యాట్రిక్ తీయాలనే ఉద్దేశంతో ఏకంగా 9 మంది ఫీల్డర్లను సర్కిల్ పెట్టాడు. స్లిప్‌లో అయితే నలుగురి ఫీల్డర్లను మొగరించాడు.

Also Read: Nirmal Crime: నిర్మల్ జిల్లాలో దారుణం.. బావపై మరదలు ఆసిడ్ దాడి

లెగ్ స్లిప్‌లో ఇద్దరు ఫీల్డర్లను పెట్టిన బెన్ స్టోక్స్.. ఇంకో ఫీల్డర్‌ను షార్ట్ మిడాన్‌లో ఉంచాడు. ఇక బౌలర్, కీపర్‌ను కలుపుకొని మొత్తం 9 మంది ప్లేయర్స్ స్టీవ్ స్మిత్ చుట్టూ ఉన్నారు. ఈ ఫీల్డ్ సెటప్‌తో తీవ్ర ఒత్తిడికి లోనైన స్మిత్.. స్టువర్ట్ బ్రాడ్ వేసిన హ్యాట్రిక్ బాల్‌ను ఆడాలా వద్దా అనే సందేహంలో వదిలేసాడు. హ్యాట్రిక్ మిస్ అయినా.. ప్రస్తుతం ఈ ఫీల్డ్ సెటప్‌కు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. ఈ ఫొటోకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. ఈ ఫొటోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ‘స్టీవ్ స్మిత్‌ ప్యాంట్ తడిసిపోవచ్చు’ అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇంగ్లండ్ బౌలర్ల అటాకింగ్, ఫీల్డ్ సెటప్‌ కారణంగా స్టీవ్ స్మిత్ పూర్తి ఆత్మరక్షణలో ఆడాడు. 59 బంతుల్లో కేవలం 16 పరుగులే చేసి బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు. 67 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆస్ట్రేలియాను ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్ ఆదుకున్నారు. చేతిలో 5 వికెట్లు ఉన్న ఆసీస్.. ఇంగ్లండ్ స్కోరుకి ఇంకా 82 పరుగులు వెనుకబడి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 393/8 వద్ద డిక్లేర్‌ చేసిన సంగతి తెలిసిందే.

Also Read: Tadipatri Crime: తాడిపత్రిలో దారుణం.. మద్యం తాగొద్దన్నందుకు నిప్పంటించాడు