Site icon NTV Telugu

IND Vs SL: శ్రీలంకదే టాస్.. అక్షర్ పటేల్‌కు మరోసారి మొండిచేయి

Team India

Team India

IND Vs SL: ఆసియా కప్‌లో ఈరోజు మరో ఆసక్తికర సమరం జరగబోతోంది. శ్రీలంకతో టీమిండియా కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మేరకు టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. పాకిస్థాన్‌తో ఆడిన రవి బిష్ణోయ్ స్థానంలో బౌలింగ్ ఆల్‌రౌండర్ అశ్విన్‌కు స్థానం కల్పించింది. అయితే ఆశ్చర్యకరంగా దీపక్ హుడానే కొనసాగిస్తూ అక్షర్ పటేల్‌కు మరోసారి మొండిచేయి చూపించింది. గత మ్యాచ్‌లో దీపక్ హుడాతో బౌలింగ్ చేయించకపోవడంతో రోహిత్‌పై విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. కాగా టీమిండియా ఫైనల్ చేరాలంటే  ఈ మ్యాచ్‌లో తప్పకుండా గెలిచి తీరాలి.

తుది జట్లు:
టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్, రిషబ్ పంత్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, చాహల్, అర్షదీప్ సింగ్
శ్రీలంక: దాసున్ షనక (కెప్టెన్), నిశాంక, కుశాల్ మెండిస్, అసలంక, గుణతిలక, రాజపక్సే, హసరంగ, కరుణరత్నే, తీక్షణ, ఫెర్నాండో, దిల్షాన్ మధుశంక

Exit mobile version