NTV Telugu Site icon

Football Club: 41 సెల్ఫ్ గోల్స్ వేశారు.. జీవితకాల నిషేధానికి గురయ్యారు

Nsami Mithty Birds Get Life Ban

Nsami Mithty Birds Get Life Ban

ఉత్కంఠభరితంగా సాగే ఫుట్‌బాల్ ఆటలో అప్పుడప్పుడు సెల్ఫ్ గోల్స్ పడడం సహజం. ఎలాగైనా తమ కోర్టులో ప్రత్యర్థులు గోల్ వేయకూడదన్న ఆతృతలో, పొరపాటుగా తామే సెల్ఫ్ గోల్స్ వేసేస్తుంటారు. ఒక్కోసారి ఈ ఇన్సిడెంట్స్ చాలా ఫన్నీగా అనిపిస్తాయి. కాకపోతే.. ఇలాంటి సెల్ఫ్ గోల్స్ అనేవి మహా అయితే ఒకట్రెండు నమోదైన దాఖలాలున్నాయి. కానీ, 41 సెల్ఫ్ గోల్స్ నమోదవ్వడం మీరెప్పుడైనా చూశారా?

సౌతాఫ్రికాకు చెందిన సామీ మైటీబర్డ్స్ అనే ఫుల్‌బాల్ క్లబ్ ఆ పని చేసింది. దీంతో, జీవితకాల నిషేధానికి గురైంది. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో, ఆ క్లబ్‌పై లైఫ్‌టైమ్ బ్యాన్ విధించారు. ఆ క్లబ్‌లో ఉన్న నాలుగు టీమ్‌లకూ ఈ నిషేధం వర్తించనుంది. ఇటీవల సామీ మైటీబర్డ్స్, మతియాసి టీమ్స్ మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహించారు. ఇందులో 59-1 గోల్స్ తేడాతో సామీ మైటీబర్డ్స్ ఘోర పరాజయం చవిచూసింది. అయితే, ఇందులో 41 గోల్స్ సామీ మైటీబర్డ్స్ సెల్ఫ్ గోల్స్ ఉన్నాయి. నిబంధనల ప్రకారం.. సెల్ఫ్ గోల్ చేస్తే, అది ప్రత్యర్థి ఖాతాలోకి వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ 41 సెల్ఫ్ గోల్స్ మతియాసి ఖాతాలోకి వెళ్లిపోయాయి.

ఒకట్రెండైతే ఓకే గానీ, మరీ 41 సెల్ఫ్ గోల్స్ కొట్టడమేంటా? అని విచారించారు. ఈ క్రమంలోనే మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు తేలింది. సామీ మైటీబర్డ్స్‌ జట్టులో ప్లేయర్‌ నెం-2 10 గోల్స్‌, ప్లేయర్‌ నెంబర్‌-5 20 గోల్స్‌, మరొక ప్లేయర్‌ 11 గోల్స్.. సెల్ఫ్‌ గోల్స్‌ కొట్టినట్లు వెల్లడైంది. ఉద్దేశ పూర్వకంగానే మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో.. సౌతాఫ్రికా లోయర్‌ డివిజన్‌లోని నాలుగు క్లబ్స్‌పై లైఫ్‌టైమ్ బ్యాన్ విధించడం జరిగింది.