Football Club: 41 సెల్ఫ్ గోల్స్ వేశారు.. జీవితకాల నిషేధానికి గురయ్యారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్కంఠభరితంగా సాగే ఫుట్‌బాల్ ఆటలో అప్పుడప్పుడు సెల్ఫ్ గోల్స్ పడడం సహజం. ఎలాగైనా తమ కోర్టులో ప్రత్యర్థులు గోల్ వేయకూడదన్న ఆతృతలో, పొరపాటుగా తామే సెల్ఫ్ గోల్స్ వేసేస్తుంటారు. ఒక్కోసారి ఈ ఇన్సిడెంట్స్ చాలా ఫన్నీగా అనిపిస్తాయి. కాకపోతే.. ఇలాంటి సెల్ఫ్ గోల్స్ అనేవి మహా అయితే ఒకట్రెండు నమోదైన దాఖలాలున్నాయి. కానీ, 41 సెల్ఫ్ గోల్స్ నమోదవ్వడం మీరెప్పుడైనా చూశారా?
సౌతాఫ్రికాకు చెందిన సామీ మైటీబర్డ్స్ అనే ఫుల్బాల్ క్లబ్ ఆ పని చేసింది. దీంతో, జీవితకాల నిషేధానికి గురైంది. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో, ఆ క్లబ్‌పై లైఫ్‌టైమ్ బ్యాన్ విధించారు. ఆ క్లబ్లో ఉన్న నాలుగు టీమ్‌లకూ ఈ నిషేధం వర్తించనుంది. ఇటీవల సామీ మైటీబర్డ్స్, మతియాసి టీమ్స్ మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహించారు. ఇందులో 59-1 గోల్స్ తేడాతో సామీ మైటీబర్డ్స్ ఘోర పరాజయం చవిచూసింది. అయితే, ఇందులో 41 గోల్స్ సామీ మైటీబర్డ్స్ సెల్ఫ్ గోల్స్ ఉన్నాయి. నిబంధనల ప్రకారం.. సెల్ఫ్ గోల్ చేస్తే, అది ప్రత్యర్థి ఖాతాలోకి వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ 41 సెల్ఫ్ గోల్స్ మతియాసి ఖాతాలోకి వెళ్లిపోయాయి.
Also Read
- Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
- Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
- Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
- PCB: షోయబ్ అక్తర్‌కు పీసీబీలో కీలక పోస్టు..! చైర్మన్ నఖ్వీతో భేటీ
ఒకట్రెండైతే ఓకే గానీ, మరీ 41 సెల్ఫ్ గోల్స్ కొట్టడమేంటా? అని విచారించారు. ఈ క్రమంలోనే మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు తేలింది. సామీ మైటీబర్డ్స్ జట్టులో ప్లేయర్ నెం-2 10 గోల్స్, ప్లేయర్ నెంబర్-5 20 గోల్స్, మరొక ప్లేయర్ 11 గోల్స్.. సెల్ఫ్ గోల్స్ కొట్టినట్లు వెల్లడైంది. ఉద్దేశ పూర్వకంగానే మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో.. సౌతాఫ్రికా లోయర్ డివిజన్లోని నాలుగు క్లబ్స్పై లైఫ్‌టైమ్ బ్యాన్ విధించడం జరిగింది.
తాజావార్తలు
-
OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
-
OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
-
Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15 వేల లోపు లభించే కొత్త ఫోన్ల జాబితా వెల్లడి..
-
Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
-
CJP: ‘‘శివాజీ పార్క్‌లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!