Site icon NTV Telugu

IND Vs SA: తొలి టీ20లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా

Toss Time

Toss Time

భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌కు తెరలేచింది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి కేఎల్ రాహుల్ తప్పుకోవడంతో రిషబ్ పంత్‌కు కెప్టెన్సీ పగ్గాలు అందాయి.

టీమిండియా
రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, హార్డిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేష్ ఖాన్, చాహల్
దక్షిణాఫ్రికా
బవుమా (కెప్టెన్), డికాక్ (వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, స్టబ్స్, పార్నెల్, ప్రిటోరియస్, కేశవ్ మహారాజ్, షంసి, కగిసో రబాడ, అన్రిచ్ నోర్జ్

కాగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు గాయం కారణంగా కేఎల్ రాహుల్ తప్పుకోవడం భారత్‌కు పెద్ద దెబ్బేనని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. సఫారీ జట్టు తమ అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగే అవకాశం ఉందని అతడు అభిప్రాయపడ్డాడు. డికాక్, డేవిడ్ మిల్లర్, రబాడ, నోర్జ్ రాణిస్తుండటంతో ఆ జట్టు ఫేవరెట్‌గా కనిపిస్తోందన్నాడు. అయితే ఐపీఎల్‌లో అదరగొట్టిన టీమిండియా కుర్రాళ్లు టీ20ల్లో రాణిస్తారని ఆశిస్తున్నట్లు వసీం జాఫర్ తెలిపాడు.

Exit mobile version