దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య వన్డే సిరీస్‌కు తెర లేచింది. పార్ల్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ వన్డే సిరీస్‌లో టీమిండియాకు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీని వదులుకున్న తర్వాత తొలిసారిగా ఈ వన్డే సిరీస్‌లో ఓ సాధారణ ఆటగాడిగా కోహ్లీ ఆడబోతున్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈరోజు తొలి వన్డే, ఈనెల 21న రెండో వన్డే, 23న మూడో వన్డే జరగనున్నాయి.
జట్ల వివరాలు
భారత్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), బుమ్రా (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, అశ్విన్, భువనేశ్వర్, యుజ్వేంద్ర చాహల్
దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్), డికాక్, జె.మలాన్, మర్‌క్రమ్, డస్సెన్, డేవిడ్ మిల్లర్, ఫెలుక్వాయో, జాన్సన్, కేశవ్ మహారాజ్, షాంసీ, ఎంగిడి
