టీమిండియా పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది.. జట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గడ్డపై ఆడలేకపోయారో.. లేక కోవిడ్ టెన్షన్ ఏమైనా పట్టుకుందో తెలియదు కాని.. మన వాళ్లు ప్రతీ మ్యాచ్‌లోనూ ఓటమిపాలయ్యారు.. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను మరో వన్డే మిగిలి ఉండగానే కైవసం చేసుకున్న సౌతాఫ్రికా.. చివరిదైన మూడో వన్డేలోనూ భారత్‌కు అవకాశం ఇవ్వలేదు.. కాకపోతే, ఈ మ్యాచ్ టీమిండియా గొప్ప ఆటతీరును కనబర్చింది.. ఒక రకంగా చెప్పాలంటే పోరాడి ఓడిపోయింది..
Read Also: ‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెటర్..
మొదట బ్యాటింగ్ చేసినా సౌతాఫ్రికా 287 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.. డికాక్ 124 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.. ఇక, భారత బౌలర్లలో ప్రసిధ్ 3 వికెట్లు తీస్తే.. చాహర్, బుమ్రా రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.. మరోవైపు 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగాన భారత్ 49.2 ఓవర్లలో 283 పరుగులు చేసి పెవిలియన్ చేరింది.. దీంతో… కేవలం 4 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం తన ఖాతాలో వేసుకుంది.. ఇక, మూడు వన్డేల సిరీస్‌ను సఫారీలు 3-0తో క్లీన్‌స్వీప్ చేశారు.. విరాట్ కోహ్లీ 65, శిఖర్ ధావన్ 61, దీపక్ చాహర్ 54 పరుగులతో భారత్‌ను గెలిపించేందుకు తీవ్ర ప్రయత్నమే చేశారు.. సూర్యకుమార్ 39, శ్రేయస్ అయ్యర్ 26 పరుగులతో పరవాలేదనిపించినా.. విజయం మాత్రం చేజారిపోయింది.