NTV Telugu Site icon

ఇండియాతో టెస్ట్ సిరీస్ కు జట్టును ప్రకటించిన సౌత్ ఆఫ్రికా…

సౌత్ ఆఫ్రికాలో ఓమైక్రా కేసులు పెరుగుతున్న కారణంగా ఈ నెలల్లో ఆ దేశానికి వెళాల్సిన టీం ఇండియా వెళ్తుందా.. లేదా అనే ప్రశ్న తలెత్తింది. అయితే ఈ పర్యటన జరుగుతుంది అని ప్రకటించిన బీసీసీఐ కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం రెండు జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ఈ నెల 26 న ప్రారంభం కానుండగా… చివరి వన్డే మ్యాచ్ జనవరి 23న ముగుస్తుంది. అలాగే ఈ పర్యటనలో టీ20 సిరీస్ జరగదు. ఇక తాజాగా క్రికెట్ సౌత్ ఆఫ్రికా ఈ పర్యటనలో భారత్ తో తలపడే సౌత్ ఆఫ్రికా టెస్ట్ జట్టును ప్రకటించింది. అయితే ఈ జట్టుకు డీన్ ఎల్గర్ కెప్టెన్ గా వ్యవరించనుండగా… టెంబా బావుమా వైస్ కెప్టెన్ గా ఉంటాడు.

దక్షిణాఫ్రికా టెస్ట్ జట్టు: డీన్ ఎల్గర్ (కెప్టెన్), టెంబా బావుమా (వైస్ కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), కగిసో రబడా, సారెల్ ఎర్వీ, బ్యూరాన్ హెండ్రిక్స్, జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్, లుంగి ఎన్‌గిడి, ఐడెన్ మర్క్రామ్, వైయాన్ ముల్డర్, అన్రిచ్ నోర్ట్జే, కీగన్ పీటర్సన్, రాస్సీ వాన్ డెర్ డ్యూస్సేన్, కైల్ వెర్రెయిన్, మార్కో జాన్సెన్, గ్లెంటన్ స్టౌర్‌మాన్, ప్రేనెలన్ సుబ్రాయెన్, సిసాండా మగాలా, ర్యాన్ రికెల్టన్, డువాన్ ఒలివియర్